Vaidyanath Temple-వైద్యనాథ జ్యోతిర్లింగం

Vaidyanath Temple పరమశివుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలు పంచారామాలుగ, పంచభూత లింగాలుగ మరియు జ్యోతి రూపంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగాను వెలసి ఉన్నాయి.ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో పంచమ జ్యోతిర్లింగం వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం రెండు ప్రదేశాలలో వెలసి ఉంది, అవి మహారాష్ట్ర లోని పరలి లోను మరియు ఝార్ఖండ్లోని దేవఘర్ లో వెలసి ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగం భూమి మీద వెలియడానికి కారణం ఏంటి? మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Vaidyanath Temple Avirbhavam-వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం:

పూర్వం రావణాసురుడి తల్లిగారైన కైకసి రావణుడిని ఒక కోరిక కోరింది, అదేమిటనగా శివుడి జ్యోతిర్లింగం తెచ్చి లంకలో ప్రతిష్టించాలని అడిగింది.అందుకు రావణుడు సరేనని బయలు దేరి కైలాస పర్వతం చేరుకొని కఠోర తపస్సు చేసి శివ సాక్షత్కారం పొందాలని చూసాడు. కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు,శివ సాక్షత్కారం కాకపోయేసరికి కత్తి తీసుకుని తన తొమ్మిది తలలను ఖండించుకున్నాడు.రావణుడు చివరిగ తన 10వ తల ఖండించపోయేసరికి శివ సాక్షత్కారం కలిగింది. అప్పుడు శివుడు రావణుడిని వరం కోరుకోమనగా రావణుడు శివుడిని పలు విధాలుగా స్తుతించి తనకు జ్యోతిర్లింగాన్ని ప్రసాదించమని కోరాడు. అందుకు శివుడు సంకటం లో పడి 2 షరతులతో జ్యోతిర్లింగం ప్రసాదించాడు.అవి ఏమిటనగ జ్యోతిర్లింగాన్ని గమ్యం చేరుకొనేవరకు భూమి మీద పెట్టకూడదు మరియు కాలినడకనే గమ్యం వెళ్ళాలి అని చెప్పి అంతర్దానమైయ్యాడు.

 Vaidyanth Temple

తదనంతరం జ్యోతిర్లింగాన్ని స్వీకరించి లంకకు కాలి నడకన బయలుదేరాడు, ఆలా కొంత ప్రయాణించిన తర్వాత రావణుడుకి కాల కృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు రావణుడు దగ్గరలో ఉన్న ఒక గోప బాలుడిని పిలిచి జ్యోతిర్లింగం పట్టుకోమని తాను కాలకృత్యాలను తీర్చుకొని వస్తాను అని చెప్పాడు. సరే నని పలికిన ఆ బాలుడు కొంత సేపటికి ఆ లింగాన్ని భూమి మీద పెట్టేసాడు. అది గమనించిన రావణాసురుడు ఆ శివలింగాన్ని ప్రకలించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పుడు పరమశివుడిని ప్రార్ధించగా శివుడు ప్రతక్షమై ఇక శివ లింగాన్ని ఎవరు ప్రకలించలేరని పలికి, భూమి మీద కు వచ్చిన ఈ లింగ స్వరూపం బీహార్ లోని దేవఘర్ లోను మరియు మహారాష్ట్రాలోని పరలి లోను జ్యోతిర్లింగంగా వెలిస్తుందని పలికాడు.తదనంతరం ఈ లింగాన్ని దర్శించి పూజించిన వారికి సకల పాపాలు పోయి స్వస్థులు అవతారని, ఆలా ఆరోగ్యం ప్రసాదించే లింగం కనుక ఈ లింగం వైద్యనాధ లింగంగా కలియుగాంతం వరకు కొలువై భక్తులను ఆశీర్వదిస్తుంది అని పలికి అంతర్దానమైయ్యాడు.

Vaidyanath/Baidyanath Temple Jharkhand -వైద్యనాథ జ్యోతిర్లింగం ఝార్ఖండ్(దేవఘర్):

ఝార్ఖండ్ లోని ప్రజలు వైద్యనాథ లింగాన్ని బైద్యనాథ్ లింగం అని పిలుస్తారు. లింగం వెలసిన ప్రదేశాన్ని పూర్వం దైవ గృహం అని పిలిచే వాళ్ళు తర్వాత కాల క్రమేణ దేవఘర్ గా మారింది. బ్రిటిష్ వాళ్లకు దేవఘర్ అని పలకటం రాక దియోఘర్ గా  పేరు మార్చారు.ఈ ఆలయాన్నిపూర్తిగా రాతితో నిర్మించారు,ఈ ప్రదేశంలో వైద్యనాథ ఆలయంతో పాటు మరో 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా ఉన్నాయి. అంతేకాకుండా అమ్మవారి 51 శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రదేశంలో సతీ దేవి హృదయం పడింది. ఇక్కడ అమ్మవారు జయదుర్గగ పూజలు అందుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఝార్ఖండ్ లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం చేరుకోవడానికి రైలు మరియు బస్సు సౌకర్యాలు కలవు.

Vaidyanth Temple

Daksha Yagnam-దక్షయజ్ఞం/శక్తి పీఠాల ఆవిర్భావం

Vaidyanath/Vaijnath Temple Maharashtra-వైద్యనాథ జ్యోతిర్లింగం మహారాష్ట్ర (పరలి):

మహారాష్ట్ర లోని ప్రజలు వైద్యనాథ లింగాన్ని వైజ్నాథ్ లింగం అని పిలుస్తారు .వైద్యనాథుని జ్యోతి యొక్క తుది ఝార్ఖండ్ లో వ్యాపించగా కొన ఈ పరలి లో వ్యాపించిందని పండితులు చెప్తుంటారు. పురాణకాలం నాటి సతీ సావిత్రి ,మార్ఖండేయుడు మరియు సత్యవతి  మొదలగు మహాత్ముల యొక్క జీవనయానం ఈ క్షేత్రం తో ముడిపడి ఉందని పురాణాలూ అభివర్ణిస్తున్నాయి. ఈ వైద్యనాథ ఆలయాన్ని తురకులు ధ్వంసం చేయగా రాణి అహల్యాబాయి పునః నిర్మించారు. ప్రధాన దైవమైన శ్రీ వైద్యనాథేశ్వరుని దర్శించిన తర్వాత ఉప ఆలయాలలో ఉన్నద్వాదశ జ్యోతిర్లింగాల రూపాలను మనం గమనించవచ్చు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల రూపాలను దర్శించడం వల్లన జ్యోతిర్లింగాల దర్శన ఫలితం కలుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి మహారాష్ట్ర లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం చేరుకోవడానికి రైలు మరియు బస్సు సౌకర్యాలు కలవు.

Vaidyanath Temple

Darshan Timings-దర్శన వేళలు :

బైద్యనాథ లింగం ఝార్ఖండ్(దేవఘర్): ఉదయం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.

వైద్యనాథ లింగం మహారాష్ట్ర(పరలి): ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు.

 

FAQ:

Leave a comment