Significance Of Arunachalam మన పురాణాలలోని స్కాంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ప్రళయ కాలం అనంతరం మళ్లీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ, సకల జీవరాసులను సృష్టి చేయడం ఆరంభించారు. మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనై ఈ సృష్టికి తానే ఆదిదేవుడని భావించసాగాడు. అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటారు.వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపగించి తనకు మర్యాదపూర్వమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగుతాడు. క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరగింది.ఈ యుద్ధం వలన లోకాలు కంపించ సాగాయి అప్పుడు దేవతలు భయాందోళనతో శివున్ని ఆశ్రయించారు
Arunachalam(Agni sthambam)-అరుణాచలం (అగ్నిస్తంభం) ఆవిర్భావం
అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభం లాగా బ్రహ్మ విష్ణు మధ్యన చేరి ఈ విధంగా పలుకుతాడు. మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను ఈ అగ్ని లింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావలసిందిగా చెప్తాడు.అప్పుడు బ్రహ్మదేవుడు హంస వాహనంతో అంతం(లింగం యొక్క శిరస్సు) చూడటానికి ఆకాశం వైపు వెళతాడు. విష్ణువు వరాహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళం లోకి వెళ్తాడు.
Arunachalam Temple Giri Pradakshin-అరుణాచల గిరి ప్రదక్షిణ చేయు విధానం
విష్ణువుకి అగ్ని లింగం యొక్క ఆది కనిపించక పోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటుకే చేరుకుంటాడు. బ్రహ్మకు కూడా అంతం దొరకదు కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడగగా ,మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారీ ఇలా కిందకి వస్తూ ఉన్నాను అని బదులు ఇచ్చింది .అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సుని చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానం ఇచ్చింది. బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సుని చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు అందుకు మొగలి పువ్వు సరేనని బదులిచ్చినది.ఇంకొంచెం దూరం పోగా కామధేనువు ఎదురు రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావ్ అని అడగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులు ఇచ్చింది. నువ్వు నేను శివుని శిరస్సు చూసానని సాక్ష్యం చెప్పాలి అని కామధేవుని అడగగా కామధేనువు మొదట సంకోచించిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నది
Fragrant Screwpine flower and kamadhenuvu Evidence-మొగలి పువ్వు కామధేనువు సాక్ష్యాలు
అప్పుడు బ్రహ్మదేవుడు తను మొదలుపెట్టిన చోటుకే తిరిగి చేరుకుంటాడు. విష్ణువు తను ఓడిపోయానని తనకి శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తారు.బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని తనకి ఇద్దరు సాక్ష్యాలు కూడా ఉన్నారని శివుడికి చెప్తారు. అప్పుడు శివుడు మొగలి పువ్వు ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదిలీ సాగింది. కామధేవుని ప్రశ్నించగా తలతో అవును అని తోకతో కాదు అని బదులు ఇచ్చింది. శివుడు తన దివ్య దృష్టితో జరిగినదంత గ్రహించి కోపంతో మొదటి సాక్షానికి గాను మొగలి పువ్వును నువ్వు నా పూజకు పనికిరావు అని శపిస్తారు. తర్వాత కామధేనువు వైపు తిరిగి తలతో అవునని తోకతో కాదని సమాధానం చెప్పావు. కనుక నీ తలభాగానికి ఎవరూ పూజలు చేయరు నీ వృష్టభాగం పూజనీయమని అని శపిస్తారు.
The curse to Brahma boon to Vishnu-బ్రహ్మకు శాపం విష్ణువుకు వరం.
తదుపరి బ్రహ్మవైపు తిరిగి కోపాద్రిక్తుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడి ఉర్ద్వముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచి వేస్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మన ముగ్గురం త్రిమూర్తులమని ఒకరికి-ఒకరికి భేదం లేదని బ్రహ్మదేవుని విడిచి పెట్టవలసిందిగా ప్రార్థించ సాగాడు. అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇక భూమి మీద ఎక్కడా ఆలయాలు ఉండవు అని శపిస్తారు. దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివున్ని క్షమించమని వేడుకోగా కరుణామయుడు అయినా శివుడు బ్రహ్మదేవునికి వరాలిస్తాడు. భూమ్మీద కేవలం ఒకటి లేదా రెండు ఆలయాలు మాత్రమే ఉంటాయని అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మ దేవుని తలచుకునే విధంగా వరమిస్తాడు.అనగా బ్రహ్మానందం, బ్రహ్మ చెవుడు, బ్రహ్మాండం మొదలుగునవి వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు.తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలుపెడితే నన్ను కూడా జయిస్తావు .అలాగే భూలోకంలో నాకన్నానీకే ఆలయాలు ఎక్కువ ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు. అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్నిస్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసిందిగా శివుడిని కోరగా శివుడు అగ్నిలింగం గా ఆవిర్భవిస్తాడు. ఇప్పుడు మనకి దర్శనమిస్తున్న అరుణాచలగిరియే భూమి మీదకు వచ్చిన అగ్ని స్థంభం(అగ్నిలింగం).ఈ లింగం ఉద్భవించిన రాత్రి నే మహా శివ రాత్రి గ మనం జరుపుకుంటాం.