Places To Visit In Rameshwaram-రామేశ్వరంలో రాముడు నడయాడిన ప్రదేశాలు

Places To Visit In Rameshwaram మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన  జ్యోతిర్లింగం రామేశ్వరం.ఈక్షేత్రం చార్ ధామ్ లుగ పిలవబడే(తూర్పున పూరి జగన్నాథ్, పశ్చిమాన ద్వారకానాథ్, ఉత్తరాదిన బద్రీనాథ్ మరియు దక్షిణాన రామేశ్వరం) నాలుగు క్షేత్రాలలో ఒకటి. తమిళనాడు రాష్ట్రం లో రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం ఈ రామేశ్వరం. రామేశ్వరం ఒక చిన్న ద్విపం, ఈ ద్విపం 50 KM  పొడవు 10 KM వెడల్పు ఉంటుంది .తమినాడు రాజధాని చెన్నై నుంచి 572 KM దూరం లో రామేశ్వరం ఉంది.ఇప్పుడు మనం ఈ క్షేత్రం లో చూడదగిన ప్రదేశాలు ఏమిటి? రామేశ్వరంలో రామునికి సంబంధించిన ప్రదేశాలు ఏంటి ? మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం.

Ramalingeswara Temple-రామలింగేశ్వర ఆలయం

రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అపూర్వమైన శిల్పకళా విన్యాసంతో మూడు ప్రాకారాలు, నాలుగు గోపురాలతో సుందర మనోహరంగా కనిపిస్తుంది.ఈ ఆలయం నిర్మించడానికి 350 సంవత్సరాలు పట్టిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది.త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మతో కలిసి లింగ ప్రతిష్ట చేసిన తర్వాత మొదట విభీషణుడు ఈ ఆలయాన్నికట్టించాడు .తదనంతరం 11 శతాబ్దం లో సింహళాదీసుడు, 14 శతాబ్దం లో ఉదయన సేతుపతి మహారాజు, శ్రీలంక ప్రభువైన పరరాజశేఖరుడు మరియు శ్రీకృష్ణదేవరాయలు ఇలా అనేక మంది రాజులు కాలక్రమేనా వివిధ కాలాలలో రామలింగేశ్వర ఆలయాన్నిఅభివృద్ధి చేశారు.1434వ సంవత్సరం నుంచి 1770 వ సంవత్సరం వరకు రామనాథపురం కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పాలించిన సేతుపతి వంశీయులు అనేక విధాలుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.

Places To Visit In Rameswaram

Rameshwaram Temple-రామేశ్వర జ్యోతిర్లింగం చరిత్ర

Agni Theertham & 22 Wells-అగ్ని తీర్థం & 22 బావులు

రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునే ముందు భక్తులు మొదటగా అగ్నితీర్థంలో తర్వాత స్వామి వారి ఆలయం లో ఉన్న 22 బావులలో స్నానం ఆచరించి దర్శనానికి వెళ్తారు.ఈ అగ్నితీర్థం రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నుంచి 100 మీటర్ల దూరంలో ఉంటుంది.ఈ తీర్థం యొక్క ప్రాముఖ్యత ఏమిటనగా రాములవారు రామేశ్వరలింగాన్ని ప్రతిష్టించే ముందు ఈ అగ్నితీర్థం లోనే స్నానమాచరించారు.కనుక భక్తులు కూడా ఈ తీర్ధంలో స్నానం ఆచరించి స్వామి వారి దర్శనానికి వెళ్లడం ఇక్కడ ఆనవాయితి. దీనితోపాటు రామలింగేశ్వర ఆలయంలో ఉన్న22 బావులలో కూడా స్నానమాచరిస్తారు.ఈ బావుల ప్రత్యేకత ఏమిటనగా యావత్ భారతావని లో ఉన్న నదులన్నీఈ బావుల అడుగులలో నుంచి ప్రవహిస్తాయని ప్రసిద్ధి, కనుక ఈ బావులలో స్నానమాచరించడం వలన సకల పుణ్య తీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.మహాలక్ష్మి, సావిత్రి, గాయత్రి, సరస్వతి, మాధవ, గంధ మాధవ, గవాక్ష, గవయ, నల, నీల, శంకర, శంక, బ్రహ్మహత్యవిమోచన, సూర్య, చంద్ర, గంగా, యమునా, గయా, శివ,సత్యామృత, సర్వ తీర్థ, కోటి తీర్థ, అనే పేర్లతో పిలవబడే ఈ పుణ్య తీర్థాల స్నానం  సకల సంపత్కరం ఆయురారోగ్య సమృద్ధికరం.

Places To Visit In Rameswaram

Ramar Padam & Sakshi Hanuman Temple-గంధమాదన పర్వతం & సాక్షి హనుమాన్ ఆలయం 

రామేశ్వరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నమరో దివ్య ధామం గంధమాదన పర్వతం,తమిళ వాళ్లు రామార్ పాదం అని పిలుస్తారు.ఈ ఆలయంలో శ్రీరాముని పాదాలు దర్శనం ఇస్తాయి.గంధమాదన పర్వతం రెండంతస్తుల ఆలయం శ్రీరాముని పాదముద్రలు  శిలా రూపంగా దర్శనం ఇస్తాయి.ఇది ఎత్తైన ప్రదేశం, ఈ ఆలయం పై భాగానికి వెళ్లి చూస్తే రామేశ్వర ద్వీపం మొత్తం కనిపిస్తుంది.ఇక్కడి నుంచి రాములవారు మొదట లంకని చూశారట.గంధమాదన పర్వతంకి కొంచెం దగ్గరలోనే సాక్షి హనుమాన్ ఆలయం ఉంటుంది.ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనగా లంక నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడు సీతమ్మ యొక్క గుర్తులు రాములు వారికి చూపించిన ప్రదేశం.అందుకే ఈ ఆలయం లోని హనుమంతుడిని సాక్షి హనుమాన్ అని పిలుస్తారు.

Ramar Padam

Rama Theertham-రామతీర్థం

రామేశ్వరానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో రామతీర్థం ఉంటుంది.ఈ తీర్థం యొక్క ప్రాముఖ్యత ఏమిటనగ రాములవారు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఈ తీర్థంలో స్నానం చేసి యుద్ధంలో విజయం చేకూరాలని శివుడిని ప్రార్ధించాడట. ఈ తీర్థం ఎదురుగ రాములవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది నాగదోషం ఉన్నవారు అగ్ని తీర్థంలో స్నానం చేసి ఈ ఆలయంలో నాగశిలలు ప్రతిష్ఠ చేయడం వలన వారు ఆ దోషం నుండి విముక్తులు అవుతారు.

Ramatheertham

Anjaneya Swami Temple & Lakshmana Theertham-పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం & లక్ష్మణ తీర్థం

రామతీర్థంకి దగ్గరలోనే పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది.ఆంజనేయ స్వామిని చిన్నతనంలో ఋషులు తన శక్తి తనకి తెలియకుండా పోతుందని శపిస్తారు ఈ ప్రదేశంలోనే ఆంజనేయస్వామి తిరిగి తన శక్తీని తెలుసుకుంటారు.కానీ ఈ సంఘటన జరిగిన ప్రదేశం వాస్తవంగా ధనుష్కోడి సమీపంలో ఉంటుంది.1964లో వచ్చిన తుఫాను ధాటికి ధనుష్కోడి నేలమట్టం అయ్యింది అందువలన అక్కడ ఉన్న ఆంజనేయస్వామిని ఈ ప్రదేశంలో ప్రతిష్టించారు.ఈ ఆలయంలో రామసేతు నిర్మించిన రాళ్ళను కూడా చూడవచ్చు. పంచముఖ ఆంజనేయస్వామి ఆలయానికి కొంచెం దగ్గరలోనే లక్ష్మణ తీర్థం ఉంటుంది. రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు లక్ష్మణుడు ఈ తీర్థంలో స్నానం చేసి శివున్ని ప్రార్థించాడని ప్రతీతి.

Lakshmana Theertham

Kodandaram Temple-కోదండరామాలయం

రామేశ్వరం నుంచి కోదండరామాలయం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది,ఈ ఆలయాన్ని విభీషణాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటనగ రావణుడిపై యుద్ధంలో గెలిచిన రాములవారు విభీషణుడికి రాజ్యాన్నిఅప్పగించి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది.1964 లో వచ్చిన తుఫాను ధాటికి ధనుష్కోడితో సహా పరిసర ప్రాంతాలు నేలమట్టం అయినప్పటికీ,ఈ ఆలయానికి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Places to Visit In rameswaram

Dhanushkodi-ధనుష్కోడి

కోదండరామాలయం నుంచి మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ధనుష్కోడి చేరుకుంటాం.ఒకప్పుడు దేశ విదేశీ పర్యాటకులతో కలకలలాడిన ఈ ప్రదేశం ఇప్పుడు గోస్ట్ టౌన్ గా మారిపోయింది.1964 ముందు వరకు ఇది ఒక గొప్ప పర్యాటక నగరంగ వచ్చే భక్తులతో కళకళలాడుతూ ఉండేది.1964  తుఫాను వల్ల తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రదేశం నివాసయోగ్యానికి పనికిరాదని నిర్ధారించింది. అప్పటి నుంచి ఇదొక గోస్ట్ టౌన్ గా మారిపోయింది. ఈ ధనుష్కోడి యొక్క ప్రాముఖ్యత ఏమిటనగ రామసేతు నిర్మాణ సమయంలో మొదట సముద్రుడు సహకరించలేదు, అప్పుడు రాములవారు ఈ ప్రదేశం నుంచి బాణం సంధించగా రామసేతు నిర్మించేందుకు వీలుగా సముద్రుడు సహకరించాడు అందుకే ఈ ప్రదేశానికి ధనుష్కోడి అనే పేరు వచ్చింది. ధనుష్కోడి అంటే బాణం చివర అని అర్థం.

Places To Visit In Rameswaram

Ramasethu& Abdul Kalam House-రామసేతు & అబ్దుల్ కలాం గారి ఇల్లు

ధనుష్కోడి నుంచి రామసేతు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది.ఇక్కడి నుంచి శ్రీలంకలోని తలైమన్నారు వరకు రామసేతు నిర్మించారు. ఒకవైపు బంగాళాఖాతం మరోవైపు హిందూ మహాసముద్రం సంఘమించే ప్రదేశం ఇది. ఇక్కడ నుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి కొంచెం సముద్రంలోపలికి వెళితే రామసేతు ఆనవాళ్లు చూడవచ్చు కానీ ఆ ప్రదేశం ప్రమాదకరమైనది కనుక మనల్ని అనుమతించరు.రామసేతు నుంచి తిరుగు ప్రయాణంలో రామేశ్వరం చేరుకునే దారిలో అబ్దుల్ కలాం గారి ఇల్లు ఉంటుంది. ఇది రామేశ్వరం ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం రామేశ్వరం లోని పంబన్ బ్రిడ్జి వైపు చూడవలసిన ప్రదేశాలు గురించి తెలుసుకుందాం.

Places to Visit In rameswaram

Pumban Bridge & Vilundi Theertham-పంబన్ బ్రిడ్జ్ & విల్లుండి తీర్థం

రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జ్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.1914 లో నిర్మించిన ఈ వంతెన భారతదేశంలోని పొడవైన వంతెనలలో ఒకటి.ఓడల రాకపోకలకు అంతరాయం కలగకుండా డబల్ లిఫ్ట్ టెక్నిక్ తో ఈ వంతెనను రెండుగా తెరుచుకునేతట్టు నిర్మించారు.పంబన్ బ్రిడ్జ్ నుంచి తిరుగు ప్రయాణంలో విల్లుండి తీర్థం ఉంటుంది,ఈ తీర్థం యొక్క ప్రత్యేకత ఏమిటనగ చుట్టూ సముద్రం ఉప్పునీటితో ఉన్నా ఈ తీర్థంలోని(బావి)నీరు మాత్రం తియ్యగా ఉంటాయి.సీతామాతకు దాహం వేసినప్పుడు రాములవారు ఈ ప్రదేశంలో బాణం వేశారు అప్పుడు ఈ తీర్థం ఏర్పడింది అందుకని ఈ బావిలోని నీరు తియ్యగా ఉంటాయి.

Pumban Bridge

Abdul Kalam Memorial & Rameswaram Beach-అబ్దుల్ కలాం గారి మెమోరియల్ & రామేశ్వరం బీచ్

విల్లుండి తీర్థం నుంచే రామేశ్వరం వెళ్లే మార్గంలో అబ్దుల్ కలాం గారి మెమోరియల్ ఉంటుంది.సాధారణంగా ఆలయాలను సందర్శించే సమయంలో చాలామంది ఇలాంటి ప్రదేశాన్ని సందర్శించరు మీకు ఎటువంటి పాటింపు లేకపోతే సందర్శించవచ్చు అగ్నితీర్థం సమీపంలోనే రామేశ్వరం బీచ్ ఉంటుంది ఇక్కడ సముద్రంలో విహరించేందుకు బోటింగ్ కూడా ఉంటుంది. ఈ సముద్ర ప్రయాణం చాల ఆహ్లాదకరంగా ఉంటుంది. రామేశ్వరం వెళ్లిన వాళ్ళు ఈ బీచ్ లో ఒకసారి విహరించండి.ఇంతటితో రామేశ్వరంలోని ముఖ్య ప్రదేశాల వివరణ పూర్తియింది.

Rameshwaram Beach

 

FAQ:

 

 

Leave a comment