Kedarnath Temple-కేదార్నాథ్ జ్యోతిర్లింగం

Kedarnath temple-కేదార్నాథ్ జ్యోతిర్లింగం,ద్వాదశ జ్యోతిర్లింగాలలో 11వ జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం.కేదారం అనే పదం సంస్కృతం నుండి వెలువడింది దీని అర్ధం పొలం. కేదారేశ్వరుని దర్శనం వలన ముక్తి కలుగుతుంది కనుక ఇది ముక్తిని ప్రసాదించే పొలం అని ప్రసిద్ధి. కేదార్నాథ్ ఆలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది, ఏప్రిల్/మే నెలలో వచ్చే అక్షయ త్రితీయ రోజున తెరచి తిరిగి నవంబర్ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు మూసి వేస్తారు. మిగిలిన ఆరు నెలలు సీతా కాలం కారణంగా ఆలయం దట్టమైన మంచుతో నిండిపోతుంది కనుక ఆ సమయంలో ఆలయంలో ఉన్న ఉత్సవ మూర్తిని దిగువున ఉన్న ఉఖిమఠ్కు తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క పురాణం విశేషాలు, ఆలయం ఎక్కడ ఉంది మరియు ఎలా చేరుకోవాలి మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం.

Kedarnath Temple History-జ్యోతిర్లింగ ఆవిర్భావ వృతాంతం:

Narayan

శివ పురాణం ఆధారంగా పూర్వం భూమండలం లో పాపాత్ములు పెరగగా శ్రీ మహా విష్ణువు నర నారాయణులుగ మారి దుష్ట శిక్షణ కొరకు కావలసిన శక్తీ కోసం బదరి క్షేత్రం చేరి 5000 వేల సంవత్సరములు తపస్సు చేసారు.అయినను ఫలితం లభించలేదు, అప్పుడు  ఆకాశవాణి దగ్గరలో ఉన్న కేదారం వెళ్లి పార్థివ లింగం ప్రతిష్టించి తపస్సు చేయడం వలన సర్వ శక్తులు లభిస్తాయి అని పలికింది. తదనంతరం నర నారాయణులు కేదారం చేరుకొని పృథ్వీ లింగం ప్రతిష్టించి 5000 సంవత్సరాలు పూజించి తపస్సు చేసారు.అప్పుడు శివుడు ప్రత్యక్షమై నర నారాయణులను వరం కోరుకోమని అడగగా నర నారాయణులు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలియమని కోరారు.  పరమేశ్వరుడు తాను ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలుస్తానని పలికి దుష్ట శిక్షణ కొరకు శక్తీ ప్రసాదిస్తున్నాను అని భవిష్యత్తులో మీకు నాకు యుద్ధం అంటూ వస్తే మిరే గేలుస్తారని పలికి కేదారేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు.

Kedarnath Temple Another Story-ద్వాపర యుగం నాటి మరియొక వృత్తాంతం:

kedarnath temple

ద్వాపరయుగంలో పాండవులు ఋషుల సలహా మేరకు తీర్థయాత్రలు చేస్తూ కేదార్ నాద్ చేరుకున్నారు. ఆ రోజు జేష్ఠ మాస శుక్లపక్ష ఏకాదశి దానిని నిజ్జల ఏకాదశి అని కూడా అంటారు అనగా ఆ ఏకాదశి రోజు ఆచమనం చేసే నీరు తప్ప ఇంక ఏమి స్వీకరించరాదు అని అర్ధం. అలా ఉపవాసం చేసి ఆ రోజు సాయంకాలం కేదారేశ్వర  దర్శనానికి వెళ్దాం అని పాండవులు అనుకున్నారు కానీ భీముడు ఆకలికి ఉండలేక తక్కిన వారికీ తెలియకుండా పండ్లు మొదలగునవి స్వీకరించాడు. ఉపవాసం అనంతరం సాయంకాలం పాండవులు స్నానం ఆచరించి శివ దర్శనానికి వెళ్లారు. అప్పుడు లింగరూపం లో ఉన్న శివుడు  మహిషుడి రూపం ధరించి అక్కడ నుంచి పారిపోయాడు.

Pandavas

అందరు కలిసి ఆ మహిషిని పట్టుకుని తాము చేసిన అపరాధం ఏమిటని, ఎందుకు మా పైన దాక్షిణ్యం చూపించడం లేదు అని అడిగారు. అప్పుడు శివుడు తనకి ఒక నియమం ఉన్నదని ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి మాత్రమే నా దర్శనం కలుగుతుందని చెప్పాడు.ఈ భీముడు ఉపవాస భంగం చేసాడని అయినను మీపైన కారుణ్యంతో ఈ విచిత్ర దర్శనం ఇస్తున్నాను అని చెప్పాడు. నా ఈ శరీరం ఇక్కడి నుంచి వ్యాపించి నయపాల (ఇప్పుడు నేపాల్) దేశం వరకు వెళ్తుంది.శిరస్సు భాగం అక్కడ ఉంటుంది కనుక పశుపతినాథ్ గా అక్కడ దర్శనమిస్తానని తృష్ట భాగం ఇక్కడ ఉంటుంది కనుక కేదారేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడ దర్శనమిస్తానని పలికి జ్యోతిర్లింగంగా వెలిశాడు.

PhalaSruthi-ఫలశృతి:

kedarnath temple

తదనంతరం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం పైన నెయ్యి పోసి పూలు సమర్పించడం వలన పునర్జన్మ లేకుండా చేస్తాను అని, ఈ లింగాన్ని పూజించడం వలన శత్రు బాధల నుండి విముక్తి చెందుతారు అని వరం ఇచ్చాడు. అంతేకాకుండా సంపూర్ణ కేదారేశ్వర దర్శన ఫలితం కలగాలంటే రెండు లింగాలను దర్శించాలని ఇక్కడ ఎవరైనా కంకణ ఆకారంలో ఉన్నబంగారం, వెండి మొదలగునవి దానం చేసిన, అవి చేయలేని పక్షాన నీటి బిందువుని తీసుకోని ఇక్కడ వదిలి పెట్టిన వారు సర్వ పాపాల నుండి విముక్తి చెందుతారని, కేదారం వెళ్తూ నా  దర్శనం కాకుండానే దారిలో మరణించిన వాళ్ళు ఖచ్చితంగా ముక్తిని పొందుతారని, ఈ కథను శ్రద్దగా విని/ చదివి కేదారేశ్వరుడిని దర్శనం చేసుకోవడం వలన ముక్తి కలుగుతుందని వరం ఇచ్చాడు.

Where And How To Reach Kedarnath Temple-కేదారేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి?

kedarnath temple

కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలోని గర్హ్వాల్ హిమాలయ శ్రేణుల నడుమ ఉంది.ఈ క్షేత్రం చేరుకోవడానికి బస్సు,రైలు మరియు విమాన మార్గాలు కలవు.

రైలు మార్గం:

మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ఢిల్లీ రైల్వేస్టేషన్ చేరుకొని అక్కడి నుంచి హరిద్వార్ చేరుకొని బస్ లేదా క్యాబ్స్ ద్వారా 239కిలో మీటర్లు ప్రయాణిస్తే కేదార్నాథ్ జ్యోతిర్లింగం చేరుకోవచ్చు.

విమాన మార్గం:

మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా డెహ్రాడూన్ లోని జోలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి హరిద్వార్ చేరుకొని బస్సు లేదా క్యాబ్ ద్వారా 239కిలో మీటర్లు ప్రయాణిస్తే  కేదార్నాథ్ జ్యోతిర్లింగం చేరుకోవచ్చు.

FAQ:

Leave a comment