kanipakam కాణిపాక ఆలయాన్ని సుమారు 1000 సంవత్సరాల క్రితం కులోత్తుంగ చోళుడు నిర్మించాడు,కాలక్రమేనా ఎంతో మంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.ఇక్కడ బాహుద నదికి పూర్వం వరదలు పొట్టెత్తడంతో ఆ వరదలకి విగ్నేశ్వరుడి విగ్రహం భూమిలో పూడుకుపోయింది, ప్రజలు ఎంత వెతికినా ఆ విగ్రహం కనిపించలేదు.మరికొన్ని సంవత్సరముల తర్వాత అదే ప్రాంతంలో అంగవైకల్యం కలిగిన ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు, ఒకరు మూగవారు, మరొకరు చెవిటి వారు మూడో అతను అంధుడు.వాళ్లు అంగ వికలాంగులైనప్పటికీ వాళ్ళు కష్టపడి జీవనం సాగిస్తూ ఉండేవారు.కొన్ని సంవత్సరాలు తర్వాత ఆ ప్రాంతానికి భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కారణంగా అన్నదమ్ముల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.అప్పుడు వాళ్ళ సాగునీరు కోసం పొలంలో ఉన్న బావిని తవ్వడం ప్రారంభించారు, అలా చాలాసేపు తవ్విన తర్వాత కొంచెం నీరు కనిపించింది.అప్పుడు వాళ్లు ఇంకొంచెం గట్టిగా గుణపంతో తవ్వసాగారు.ఆ గుణపం పోయి ఒక రాయికి తగిలి ఆ రాతి నుంచి రక్తం వచ్చి ముగ్గురు అన్నదమ్ముల మీద పడటంతో వారికి ఉన్న అంగవైకల్యం తొలగిపోయింది.
Kaniparakam Over time Kanipakam-కాణిపారకం కాలక్రమేన కాణిపాకం
అప్పుడు అన్నదమ్ములు ఆ ఊరి రాజు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తారు.రాజు ఊరు జనంతో ఆ బావి దగ్గరికి వచ్చి స్వయంభుగా వెలసిన వినాయకుని విగ్రహం నుంచి రక్తం కారటం చూసారు.ఆ విగ్రహాన్ని భావి నుంచి పైకి తేవాలని శతవిధాలుగా ప్రయత్నించారు కాని ఫలితం లేకుండా పోయింది.అక్కడికి తండోపతండాలుగా వచ్చిన జనం, కొబ్బరికాయలు కొట్టి కొబ్బరినీళ్ళతో అభిషేకం చేయసాగారు. దానితో శాంతించిన స్వామి వారు బావిలోని నీటిమట్టం పెరుగుతుండగా ఆ నీటిలో తేలియాడుతూ పైకి రాసాగారు. అలా ఆ నీరు ఆ పక్కనే ఉన్న ఒక పావు ఎకరా వరకు పారసాగింది. తమిళంలో కాణి అంటే పావు ఎకరం మడి భూమి పారకం అంటే నీరు ప్రవహించటం. అలా ఆ మడి భూమి లో ప్రవహించిన కొబ్బరి నీరుని కాణిపారకం అని పిలుస్తూ ఉండేవారు అది కాలక్రమేన కాణిపాకం అయ్యింది.
Ayodya Ram Mandir-అయోధ్య మోక్షపురి
Is The Idol Of Lord Vinayaka Is Increasing?-కాణిపాకం లోని వినాయకుని విగ్రహం పెరుగుతుందా?
ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమనగా వినాయక స్వామి విగ్రహం పెరుగుతూ వస్తుంది. ఈ విషయాన్ని అధికారులు ఆధారంతో సహా రుజువు చేశారు,సుమారు 50 సంవత్సరాల క్రితం చేయించిన వెండి తొడుగులను స్వామివారికి అలంకరించాలని ప్రయత్నించగా అవి సరిపడలేదు. ఏదో ఒకసారి అంటే పొరపడి ఉంటారు అని అనుకోవచ్చు, కాని ఈ విషయం పదేపదే వాళ్ళకి చాలాసార్లు జరుగుతూ వచ్చింది. 1945 లో చేయించిన తొడుగులు, కొన్నేళ్ల తర్వాత స్వామివారికి సరిపోలేదట, అంతేగాక 2002 మరియు 2006లో కూడా ఇదే విధంగా జరిగింది. ఇంకా స్వామివారికి మొదట్లో బొజ్జ కనిపించేది కాదని ఇప్పుడు పెరిగిందని అర్చకులు చెప్తుంటారు వీటన్నిటిని బట్టి స్వామివారి విగ్రహం కచ్చితంగా పెరుగుతుందని నిర్ధారణకు వచ్చారు.ఇక్కడ ఆలయంలోని ఒక బావిలో స్వామివారికి వాహనమైన ఎలుక ఉంటుందట. అక్కడ మీకు ఇష్టమైనది లేదంటే స్వామివారి ఇష్టమైన పదార్థాన్ని వదిలేస్తే తమ కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం.
Panchayathana Temple-పంచాయితనాలయం
ఇది గణపతి పంచాయతన ఆలయం అంటే గణపతి ఉండి పక్కన అమ్మవారు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి మరియు సూర్యుడు ఉంటారు.ఈ ఆలయానికి వాయువ్యం మరియు ఈశాన్య మూలన ఇంకొ రెండు ఆలయాలు ఉన్నాయి.వాయువ్య మూలన మణికంఠేశ్వర ఆలయం ఉంటుంది, మనకి దూరం నుంచి చూస్తే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్న తోట కనిపిస్తుంది.ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో కట్టించారు. ఈ ఆలయంలో అమ్మవారు మరకతాంబిక దేవిగాను, సూర్య భగవానుడు మరియు కాలభైరవుడు కొలువై ఉన్నారు.వినాయకుని ఆలయానికి ఈశాన్యవైపున వరదరాజస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి, శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా మనకి దర్శనమిస్తారు.ఈ ఆలయంలో ప్రతిరోజు సుదర్శన హోమం జరుగుతూ ఉంటుంది ఎవరైనా వెళ్లి ఉచితంగా ఈ హోమంలో కూర్చోవచ్చు. మనం చేయించుకోవాలంటే అక్కడ 501రూపాయి చెల్లించాల్సి ఉంటుంది.సుదర్శన హోమం చేయించుకోవడం వల్ల ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని ఇక్కడ భక్తులు నమ్మకం.
How To Reach Kanipakam?-కాణిపాక పుణ్యక్షేత్రంఎలా చేరుకోవాలి?
1.బస్సు మార్గం:
కాణిపాకం తిరుపతి నుంచి 74 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.తిరుపతి నుండి ప్రతి 15 నిమిషాలకు మరియు చిత్తూరు నుండి ప్రతి 10 నిమిషాలకు బస్సు వెసులుబాటు కలదు. చంద్రగిరి నుండి జీపులు వ్యానులు మరియు టాక్సీలు మొదలగునవి లభించును.
2.రైలు మార్గం:
రైలు మార్గం ద్వారా రావాలనుకునేవారు రైలులో మొదట రేణిగుంట లేదా చిత్తూరు చేరుకోవాలి .అక్కడి నుండి బస్సుల ద్వారా కాణిపాకం చేరుకోవచ్చు.
3.విమాన మార్గం:
విమాన మార్గం ద్వారా రావాలనుకునేవారు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం వచ్చి అక్కడ నుంచి జీపులు లేదా టాక్సీలు ద్వారా కాణిపాకం చేరుకోవచ్చు.
Darshan Timings-దర్శన వేళలు:
ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారిని మనం దర్శించుకోవచ్చు.