Arunachalam Temple In Telugu అరుణాచలేశ్వర ఆలయంలో మనం దర్శించవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.ఆలయం లోపలికి వెళ్ళబోయే ముందు తూర్పు వైపు ఉన్న రాజగోపురాన్ని చూద్దాం.ఈ రాజగోపురం 217 అడుగుల పొడవు గల రాజగోపురం దీనిని శ్రీ కృష్ణదేవరాయలు వారు కట్టించారు.మన దేశంలోనే పొడవైన రాజు గోపురాలలో ఇది ఒకటి.ఈ రాజగోపురం లోపలకి వెళ్ళగానే ఎడం వైపున శక్తిగణపతి విగ్రహం ఉంటుంది .ఈ శక్తి గణపతి పక్కనే అరుణగిరి నాదర్ విగ్రహం ఉంటుంది.అరుణగిరి నాదర్ కి ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి.ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కంబత్తు ఇళయ నార్ ఆలయం కనిపిస్తుంది.
Kambathu Ilayanar Temple-కంబత్తు ఇళయ నార్ ఆలయం
కంబత్తు ఇళయ నార్ ఆలయాన్నితెలుగులో స్తంబోధ్వవ కుమారస్వామి ఆలయం అని అంటారు.ఇక్కడ కుమారస్వామి ఒక స్తంభంలో నుంచి వెలుపలికి వచ్చారు అందుకని స్తంబోధ్వవ కుమారస్వామి ఆలయం అని పిలవబడుతుంది.ఈ కుమారస్వామి ఆలయానికి ఎడమ వైపున శివగంగ తీర్థం, కుడి వైపున 1000 కాళ్ళ మండపం ఉంటాయి.వేయి కాళ్ళ మండపంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఈ మండపంలో నైరుతి మూల పాతాళ లింగం ఉంటుంది.ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి వారు తపస్సు చేశారు.పాతాళ లింగానికి పక్కన ఒక పెద్ద నంది కనిపిస్తుంది.
Arunachalam-అరుణాచలం యొక్క విశిష్టత
Ballala Nandi-బల్లాల నంది
ఈ నందిని బల్లాల మహారాజు ప్రతిష్టించాడు.ప్రతినెల మాస ప్రదోషం అనగా త్రయోదశి రోజు అరుణాచలంలోని అన్నినందులు అలంకారాలతో కళకళలాడుతూ ఉంటాయి.ఈ నంది నుంచి మొదలు ప్రతి ప్రాకారంలో ఉండే నందుల యొక్క పరిమాణం తగ్గుతూ ఉంటాయి.ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళితే బల్లాల గోపురం వస్తుంది.
Gopura Subramanya Temple-గోపుర సుబ్రహ్మణ్య ఆలయం
బల్లాల మహారాజు గోపురాన్నిచేరుకునే ముందు కుడిచేతి వైపున గోపుర సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది.ఈ ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ గోపురం మీద నుంచి అరుణగిరి నాదర్ చనిపోవాలని కిందకి దూకేసేటప్పుడు సుబ్రమణ్య స్వామి వచ్చి అతని ప్రాణాలు కాపాడుతాడు.ఈ గోపురం దగ్గర కాపాడుతాడు కనుక ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పేరు వచ్చింది.
Arunachalam Temple Giri Pradakshin-అరుణాచల గిరి ప్రదక్షిణ చేయు విధానం
Ballala Gopuram-బల్లాల గోపురం
బల్లాల మహారాజు కట్టించిన గోపురం కనుక బల్లాల గోపురం అని అంటారు.బల్లాల మహారాజు శివ భక్తుడు అరుణాచల ఆలయంలో సగం కట్టడాలు ఆయన కట్టించినవే.బల్లాల గోపురానికి ఎడం చేతి వైపు ఉండే ఆలయాన్ని కళ్యాణ సుందరేశ్వర ఆలయం అని అంటారు.అరుణాచలంలో జరిగే కల్యాణాలన్నీఈ ఆలయంలోనే జరుగుతాయి.భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గాని ఉంటె వాళ్ళు ఈ ఆలయంలో అర్చన/పూజ చేయించుకుంటే ఇరువురి మధ్య సఖ్యత కుదురుతుంది.బల్లాల గోపురం దాటంగానే ఎడం వైపున కాలభైరవాలయం కనిపిస్తుంది భారతదేశంలో ఉన్న అద్భుతమైన కాలభైరవ విగ్రహాలలోఈ విగ్రహం ప్రథమ స్థానంలో ఉంటుంది.
Bramha Tirtham & Arunagiri Nathar Statue-బ్రహ్మ తీర్థం & అరుణగిరి నాధర్ విగ్రహం
కాలభైరవాలయం పక్కనే బ్రహ్మ తీర్థం ఉంటుంది,ఈ బ్రహ్మ తీర్థం ఎదురుగా బ్రహ్మ లింగం ఉంటుంది దర్శించండి.ఆ పక్కనే గోడ మీద అరుణగిరి నాదర్ విగ్రహం ఉంటుంది.అరుణగిరి నాధర్ విగ్రహం నుంచి ఎడం వైపున సౌత్ గోపురం ఉంటుంది.ఈ గోపురం దగ్గర ఉండే గోశాలలో ఇదైకట్టుసిద్దర్ అనే ఒక సిద్దుడి సమాధి ఉంటుంది.తమిళనాడులో 18 మంది సిద్ధలు ఉండేవారు వాళ్లలో ఈయన ఒకరు.ఈ సౌత్ గోపురం ఎదురుగా నార్త్ గోపురం ఉంటుంది.
Ammani Amman Gopuram & Kili Gopuram-అమ్మని అమ్మన్ గోపురం & కిలి గోపురం
నార్త్ గోపురాన్నిఅమ్మని అమ్మన్ గోపురం అని అంటారు,ఈ గోపురం 171 అడుగుల ఎత్తులో ఉంటుంది.ఈ గోపురం నుంచి వెలుపలికి వస్తే మనకి రుక్కు అనే ఒక ఏనుగు సమాధి కనిపిస్తుంది.సౌత్ గోపురానికి నార్త్ గోపురానికి మధ్యలో కిలి గోపురం ఉంటుంది.రాజగోపురం నుంచి లెక్క పెట్టుకుంటే కిలి గోపురం మూడో గోపురం అవుతుంది.కిలి అంటే చిలుక,అరుణగిరి నాదర్ ఇక్కడ చిలుక రూపంలో సుబ్రహ్మణ్య ఉపాసకులకు కనిపిస్తారని చెప్తూ ఉంటారు.ఈ కిలి గోపురం దాటుకొని వెలుపలికి వస్తే ఎడం చేతి వైపున వకుళ వృక్షం ఉంటుంది.
Vakula Tree/9 Gopuram View Point-వకుల వృక్షం/తొమ్మిది గోపురాల వ్యూ పాయింట్
వకుల వృక్షం అంటే పొగడ చెట్టు,ఈ చెట్టు కింద ఒక సర్కిల్ గీసి ఉంటుంది.అక్కడ నిలబడి గమనిస్తే మనకు అరుణాచల ఆలయంలోని తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి.ఈ స్పాట్ ని తొమ్మిది గోపురాల వ్యూ పాయింట్ అని అంటారు.ఈ వకుల వృక్షం నుంచి కొంచెం ముందుకు వెళ్లితే అరుణాచలేశ్వర గర్భాలయం వెనుక వైపున అరుణగిరి యోగి మండపం ఉంటుంది.
Arunagiri Yogi Mandapam-అరుణగిరి యోగి మండపం
ఈ మండపంలో అరుణగిరి యోగి యొక్క విగ్రహం ఉంటుంది. అరుణాచలంలో శివుడు మూడు రకాలుగా ఉంటాడు. ఒకటి అరుణాచల ఆలయం లో ఉండే అగ్ని లింగం, రెండోది అరుణగిరి, మూడోది దక్షిణామూర్తి రూపంలో ఉన్న అరుణగిరి యోగి. ఈ మండపం నుంచి ఎడం చేతి వైపున గమనిస్తే పాద మండపం ఉంటుంది.
Padha Mandapam & Sthula Sukshmar Temple-పాద మండపం & స్థూల సూక్ష్మ ఆలయం
శివుడు మొట్టమొదట అగ్నిలింగంగా వచ్చినప్పుడు పాదాలు పెట్టిన చోటు కనుక ఈ మండపాన్నిపాద మండపం అని పిలుస్తారు.ఈ మండపం పక్కనే స్థూల సూక్ష్మ ఆలయం ఉంటుంది. గర్భాలయంలో ఉండే అగ్నిలింగం స్థూలరూపమైతే ఈ ఆలయంలో ఉన్న శివుడు సూక్ష్మరూపం. గర్భాలయంలో ఉండే లింగానికి అభిషేకం చేస్తే ఈ ఆలయంలో ఉన్న శివుడు విగ్రహం మీద నీటి బిందువులు కనిపిస్తాయని చెప్తుంటారు. గిరిప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఈ స్థూల సూక్ష్మ ఆలయం చుట్టూ 11 సార్లు తిరిగితే గిరిప్రదక్షిణ చేసిన పుణ్యం మనకు లభిస్తుంది.
ApeethaKuchamba Temple& Chitra Guptha Temple-అపీత కుచాంబ ఆలయం & చిత్రగుప్త సన్నిధి
స్థూల సూక్ష్మ ఆలయ దర్శన అనంతరం మనం దర్శించవలసినది అపీత కుచాంబ ఆలయం.అమ్మవారు అద్భుతమైన, నయన మనోహరమైన అలంకారంతో మనకు దర్శనం ఇస్తారు.అమ్మవారికి ముందు అష్టలక్ష్మి మండపం ఉంటుంది.ఈ మండపంలో 16 స్తంభాలతో కూడిన శిల్పకళ కనులవిందుగా ఉంటుంది.అమ్మవారి ఆలయం నుంచి వెలుపలకు రాగానే కుడి వైపున చిత్రగుప్త సన్నిధి ఉంటుంది.ఈ చిత్ర గుప్తుడిని మనం నేరుగా దర్శించకూడదు కిటకి లో నుంచి మాత్రమే దర్శించాలి అని ఇక్కడ నియమం.
Panchabhutha Lingalu & Pidari Amman Temple-పంచభూత లింగాలు & పిడారి అమ్మన్ ఆలయం
అపీత కుచాంబ అమ్మవారి ఆలయం నుంచి వెలుపలకు రాగానే నాలుగు లింగాల ఆలయాలు ఉంటాయి.అవి పృద్వి లింగం,జల లింగం,ఆకాశ లింగం & వాయు లింగం.కంచి, జంబుకేశ్వరం, చిదంబరం & కాలహస్తిలో ఉన్న నాలుగు లింగాలను మనం ఒకే రోజు దర్శించలేము కనుక ఋషులు ఈ నాలుగు లింగాలను ఇక్కడ ప్రతిష్టించారు.ఈ నాలుగు లింగాలను దర్శించుకున్నతర్వాత అగ్నిలింగమైన అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటే ఒకేరోజు ఐదు లింగాలను దర్శించుకున్న పుణ్యం మనకి లభిస్తుంది. ఈ ఆలయాల ఎదురుగా పిడారి అమ్మన్ ఆలయం ఉంటుంది.
పిడారి అమ్మన్ అమ్మవారు అరుణాచలానికి నగరపాలకురాలు.ఈ ఆలయంలో సప్త మాతృకల విగ్రహాలు మరియు రేణుకాదేవి విగ్రహం ఉంటాయి.రాత్రి అయితే అమ్మవారు వెలుపలకు వచ్చి నగరసంచారం చేస్తారని సాధకులు మరియు సిద్ధులు చెప్తుంటారు.ఈ ఆలయానికి ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది అది బిల్వ వృక్షం మరియు అశ్వద వృక్షం కలిసి ఉన్నచెట్టు.ఈ చెట్టు పైన సిద్దులు ఉంటారని ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి కనిపిస్తుంటారని చెప్తుంటారు.
Pichai ilayanar Temple-పిచ్చెయ్ ఇలయనార్ ఆలయం
ఆ చెట్టు నుంచి మనం ప్రధాన ఆలయంలోకి వెళ్లేటప్పుడు కుడిచేతి వైపున పిచ్చెయ్ ఇలయనార్ అనే సుబ్రమణ్య స్వామి ఆలయం కనిపిస్తుంది.ఈ ఆలయంలో సుబ్రమణ్య స్వామికి సంబంధించిన జపాలు/స్తోత్రాలు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
Arunachleshwar Garbhalayam-అరుణాచలేశ్వరుని గర్భాలయం
మనం చివరిగా దర్శించవలసినది అరుణాచలేశ్వరుని గర్భాలయం. అరుణాచలేశ్వరుని దర్శించే ముందు గర్భాలయం చుట్టూ ఉన్న దక్షిణామూర్తి,దుర్గాదేవి మరియు వెనుక వైపున ఉన్నలింగోద్భవ మూర్తులను దర్శించుకుని,అలాగే అరుగుల మీద 63 నాయనార్ల విగ్రహామూర్తులు దర్శించుకుందాం.ఆ తర్వాత అరుణాచలేశ్వరుని దర్శించుకుని మన జన్మ చరితార్థం చేసుకుందాం.
FAQ