Arunachalam In Telugu అరుణాచలం విశిష్టతను చెబుతూ తిరువరూర్లో జన్మించడం,కాశీలో మరణించడం మరియు చిదంబరాన్ని దర్శించడం వల్ల వచ్చే మోక్షం కేవలం అరుణాచలన్నిస్మరించడం వల్ల వస్తుందని చెబుతారు.అంత విశిష్టమైన క్షేత్రం ఈ అరుణాచలం.అరుణ అంటే పాపములను హరించునది అని అర్థం, అచలము అంటే కొండ అరుణాచలం అనగా పాపములను హరించు కొండ అని అర్థం. దీనికి మరో అర్థం కూడా ఉంది.అరుణ అంటే ఎర్రని అని, అచలము అంటే కొండ అని అరుణాచలము అంటే ఎర్రని కొండ అని అర్థం వస్తుంది. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడ బడ్డ క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి.ఇక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహత్యం లో వివరించబడినది.
Story behind Arunachalam-అరుణాచల ఆవిర్భావఘట్టం
పూర్వం బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది .ఆ యుద్ధం ఆపడానికి శివుడు ఇద్దరి మధ్య ఒక పెద్ద జ్యోతి స్తంభం లాగా వెలిశాడు.అనంతరం విష్ణువును మరియు బ్రహ్మను ఈ జ్యోతి స్తంభం యొక్క ఆది మరియు అంతము చూసి రమ్మని శివుడు ఆదేశిస్తాడు.ఇద్దరకీ ఎంత ప్రయతించిన ఆది మరియు అంతం కనిపించదు. అప్పుడు విష్ణువు తాను ఈ లింగము యొక్క ఆది చూడలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు, అయితే బ్రహ్మ తాను శీర్ష(తల)భాగం చూశానని అసత్యం పలుకుతాడు.అందుకు ఆగ్రహించిన శివుడు,నీకు ఇక భూమి మీద ఎక్కడా ఆలయాలు ఉండవు అని బ్రహ్మను శపిస్తాడు.తదుపరి విష్ణువు వంక తిరిగి భూలోకంలో నాకన్నా నీకే ఎక్కువ ఆలయాలు ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు,తదనంతరం అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు.ఆలా ఆవిర్భవించిన అగ్నిలింగమే అరుణాచలము.ఇప్పుడు మనం అరుణాచల గిరి ప్రదక్షిణ మరియు దర్శించ వలసిన దేవాలయాలు గురించి తెలుసుకుందాం.
Significance of Arunachalam-అరుణాచలం యొక్క విశిష్టత
Giripradakshin & Temples to Visit-గిరి ప్రదక్షిణ మార్గం లో దర్శించవలసిన ఆలయాలు
అరుణాచల గిరిప్రదక్షిణ చేయడం వలన నూరు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది.ఈ గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది.అరుణాచలంలో ఎనిమిదిక్కులన ఎనిమిది శివలింగాలు ఉంటాయి.వీటిని ఇంద్రుడు,యముడు,అగ్ని దేవుడు తదితర దేవతలు ప్రతిష్టించారు. వీటితో పాటు ఎదిర్నేర్ అన్నామలై ఆలయం,ఆది అన్నామలై ఆలయం,సూర్య లింగం మరియు చంద్ర లింగం వంటి ఆలయాలు మరియు రమణాశ్రమం,శేషాద్రి ఆశ్రమం మొదలగు ఆశ్రమాలు కూడా ఈ గిరిప్రదక్షిణ మార్గం లో కలవు. ఈ గిరిప్రదక్షిణ మరియు ఆలయాలను సందర్శించిన తర్వాత చివరిగా మనం దర్శించవలసినది అరుణాచలేశ్వర ఆలయం.
Arunachalam Temple Giri Pradakshin-అరుణాచల గిరి ప్రదక్షిణ చేయు విధానం
Arunachaleswara Temple-అరుణాచలేశ్వర ఆలయం
ఈ ఆలయం మన దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటి.ఈ ఆలయాన్ని 25 ఎకరాల్లో నిర్మించారు.అరుణాచలేశ్వర ఆలయంకి తూర్పు వైపు రాజగోపురం ఉంటుంది, ఈ రాజగోపురం 217 అడుగుల పొడవు గల రాజగోపురం దీనిని కృష్ణదేవరాయలు వారు కట్టించారు.అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలంటే ఈ రాజగోపురం నుంచి మొదలు మూడు గోపురాలను దాటి వెళ్లాలి.రాజగోపురం దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే కంబత్తు ఇళయ నార్ ఆలయం ఉంటుంది దీనిని తెలుగులో స్తంభోధ్బవ కుమారస్వామి ఆలయం అని అంటారు.ఈ ఆలయం దర్శించిన తరవాత మనం చేరుకోవాల్సిన రెండవ గోపురం బల్లాల గోపురం.బల్లాల గోపురాన్నిచేరుకునే ముందు కుడిచేతి వైపున గోపుర సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది దర్శించండి. ఈ ఆలయాన్ని దర్శించిన తరవాత మనం చేరుకోవాల్సిన మూడో గోపురం కిలి గోపురం.కిలి అంటే చిలుక,అరుణగిరి నాదర్ ఇక్కడ చిలుక రూపంలో సుబ్రహ్మణ్య ఉపాసకులకు కనిపిస్తారని చెప్తూ ఉంటారు.ఈ కిలి గోపురం దాటుకున్న తరువాత అరుణాచలేశ్వరుని గర్భాలయం మరియు అపీత కుచాంబ అమ్మవారి ఆలయాలు ఉంటాయి దర్శించుకుని మన జన్మ చరితార్థం చేసుకుందాం.
Arunachalam Temple-అరుణాచలేశ్వర ఆలయ విశేషాలు
How to reach Arunachalam-అరుణాచలం ఎలా చేరుకోవాలి
అరుణాచలంని తమిళంలో తిరువన్నామలై అని పిలుస్తారు.ఇది చెన్నైనుండి 195 కిలోమీటర్లు, తిరుపతి నుండి 193 కిలోమీటర్లు మరియు బెంగుళూరు నుంచి 206 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
1.బస్సు సౌకర్యం:
మన తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలంకు ఆర్.టి.సి మరియు ప్రైవేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 10 నుంచి 15 గంటల ప్రయాణం తర్వాత అరుణాచలం చేరుకోవాల్సి ఉంటుంది.
2.రైలు సౌకర్యం:
రైలు ప్రయాణం చేయాలనుకునే వారు వీక్లీ ట్రైన్స్ ద్వార నేరుగా అరుణాచలం చేరుకోవచ్చు,కాని అవి దొరకని పక్షాన కాట్పాడి జంక్షన్ లేదా వేలూరు వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడి నుంచి బస్సు మార్గం ద్వార చేరుకోవచ్చు.
3.విమాన సౌకర్యం:
విమాన ప్రయాణం చేయాలనుకునే వారు విమానంలో ముందుగా చెన్నై చేరుకోవాల్సి ఉంటుంది.అక్కడ నుంచి బస్సు ద్వారా నాలుగు/ఐదు గంటలు ప్రయాణించి అరుణాచలం చేరుకోవచ్చు.
Darshan Timings-దర్శన వేళలు
ఉదయం: 05:30 AM to 12:30 PM
సాయంత్రం : 4:00 PM to 9:30 PM.
FAQ:
ARUNACHALAM temple