Arunachalam Temple Giri Pradakshin అరుణాచలం లోకి మనం ప్రవేశించగానె ముందుగా అరుణ గిరి కనిపిస్తుంది. ఈ గిరినె మహాశివలింగంగా పురాణాల్లో చెప్పబడి ఉన్నది. అందుకే భక్తులందరూ ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు.కలియుగంలో అనాధ ప్రేత సంస్కారం చేసినవారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. అటువంటి నూరు అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక్క గిరిప్రదక్షిణ చేయడం వలన లభిస్తుంది. అరుణాచల గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మనం గిరి ప్రదక్షణ ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలుసుకుందాం. రెండు చోట్ల నుంచి గిరి ప్రదక్షణ మొదలు పెడుతూ ఉంటారు ఒకటి అరుణాచలేశ్వర ఆలయం నుంచి రెండోది రమణ మహర్షి ఆశ్రమం వద్ద నుంచి. గిరిప్రదక్షిణ ఎక్కడ నుంచి మొదలు పెట్టామో తిరిగి అక్కడికి వచ్చి పూర్తి చేయాలి.
Arunachalam Asta lingala Significance –అష్ట లింగాల విశిష్టతి
అరుణాచలంలో ఎనిమిదిక్కులలో శివలింగాలు ఉంటాయి ఈ శివలింగా ల విశిష్టతి ఏమిటి? అవి ఎవరు ప్రతిష్టించారు? అనేది తెలుసుకుందాం.
Arunachalam-అరుణాచలం యొక్క విశిష్టత
Indra Lingam & Agni Lingam-ఇంద్ర లింగం & అగ్నిలింగం
ముందుగా మనం చేరుకునేది ఇంద్ర లింగం,ఇది ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఇంద్ర లింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది దీనిని ఇంద్రుడు ప్రతిష్టించాడు. ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు అధిదేవతలు, ఇంద్ర లింగాన్ని పూజించటం వల్ల ఉద్యోగ పరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయువు లభిస్తుంది. ఇంద్ర లింగం నుంచి 1.5 km ప్రయాణిస్తే అగ్ని లింగం వస్తుంది.
అగ్ని లింగం మెయిన్ రోడ్ లో ఉండదు, ఈ లింగం కుడి పక్కన కొంచం లోపలికి వెళ్లాక మనకి కనిపిస్తుంది. అగ్నిలింగం అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ అగ్ని లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్టించాడు.ఈ క్షేత్రానికి అధిదేవత చంద్రుడు.ఈ అగ్ని లింగాన్ని పూజించటం వల్ల ఆపత్కాల/ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు.ఇక్కడ నుంచి 1.7 km ప్రయాణిస్తే యమలింగం చేరుకుంటాం.
Yama Lingam & Niruthi Lingam-యమలింగం & నైరుతి లింగం
యమలింగం అరుణగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది దీనిని యముడు ప్రతిష్టించాడు.ఈ క్షేత్రానికి మంగళుడు(కుజుడు) అధిదేవత.ఈ ఆలయంలో అంగారక రుణ విమోచన స్తోత్రం పారాయణం చెస్తే మనకు అద్భుత ఫలితాన్నిస్తుంది.ఈ లింగాన్ని పూజించటం వలన ప్రమాదాలు/అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతుంది.ఇక్కడి నుంచి 1.6 km ప్రయాణిస్తే నైరుతి లింగం చేరుకుంటాం.
నైరుతి లింగం అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది.ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్టించాడు.ఈ క్షేత్రానికి అధిదేవత రాహువు.ఈ నైరుతి లింగాన్ని పూజించటం వలన రాక్షస,పితాజ,దుష్ట మరియు గ్రహ బాధలన్నీ పోతాయి అలాగే అద్భుతమైన కీర్తి వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎదిర్నేర్ అన్నామలై ఆలయం వస్తుంది.
Adirner Annamalai temple-ఎదిర్నేర్ అన్నామలై ఆలయం
ఈ ఆలయం అరుణగిరికి సరిగ్గా వెనక భాగం వైపు ఉంటుంది .ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనగా తమిళ ఉగాది రోజున తొలి సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడుతాయి.
Surya Lingam & varuna Lingam -సూర్య లింగం & వరుణ లింగం
సూర్య లింగం అష్ట లింగాల లోని లింగం కాదు,దీనిని సూర్య భగవానుడు ప్రతిష్టించారు.సూర్య లింగం వద్ద ఆదిత్య హృదయ స్తోత్రం కానీ ఆదిత్య కవచం కానీ సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఒకసారి పారాయణం చెస్తే కొన్ని వేల సార్లు పారాయణం చేసిన పుణ్యం లభిస్తుంది.ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్లితే వరుణ లింగాన్ని చేరుకుంటాం.
వరుణ లింగం అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది.ఈ లింగాన్ని వరుణ దేవుడు ప్రతిష్టించారు.ఈ లింగానికి అధిదేవత శనైశ్వరుడు.ఈ లింగాని పూజించి అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది,అలాగే స్వామివారి విభూది ప్రదోషకాలంలో పెట్టుకుంటే పాపవిముక్తులు అవుతారు. ఇక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే ఆది అన్నామలై దేవాలయం చేరుకుంటాం.
Aadi Annamalai Temple-ఆది అన్నామలై ఆలయం
గిరి ప్రదక్షణ చేసేటప్పుడు ఆది అన్నామలై ఆలయాన్నితప్పకుండా దర్శించండి.అరుణాచలంలో మొట్టమొదటి ఆలయం ఇది. అరుణాచలేశ్వర ఆలయం కంటే కొన్ని వందల ఏళ్ల పూర్వమైనది. చారిత్రక ఆధారాల ప్రకారం 2000 సంవత్సరాల పూర్వమే ఉన్నదని చెప్తున్నారు.ఈ ఆలయాన్నిసాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్టించాడు.ఈ ఆలయం దర్శించడం వలన కోరిన కోరకపోయినా మనకు సకల కోరికలు తీరుతాయి.ఇక్కడ నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే వాయు లింగాన్ని చేరుకుంటాం.
Vayu Lingam & Chandra Lingam-వాయు లింగం & చంద్ర లింగం
అరుణగిరికి వాయువ్య దిక్కున వాయు లింగం ఉంటుంది.ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు.ఈ వాయు లింగాన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాలు నుంచి విముక్తులం అవుతాము.ఇక్కడ నుంచి 0.6 km ప్రయాణిస్తే చంద్ర లింగాన్నిచేరుకుంటాం.
చంద్ర లింగం అష్ట లింగాలలో ని లింగం కాదు దీనిని చంద్రుడు ప్రతిష్టించారు.చంద్రలింగాన్ని దర్శించడం వలన మానసిక స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తుంది.ఇక్కడ నుంచి 1 km ప్రయాణిస్తే కుబేర లింగాన్నిచేరుకుంటాం.
Kubera Lingam-కుబేర లింగం
అరుణగిరికి ఉత్తర దిక్కున కుబేర లింగం ఉంటుంది.ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్టించాడు.ఈ క్షేత్రానికి అధిదేవత బృహస్పతి.ఈ లింగాన్ని దర్శించడం వలన భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి.ఇక్కడి నుంచి 1.8 KM ప్రయాణిస్తే ఈశాన్య లింగాన్ని చేరుకుంటాం.
Moksha Margam-మోక్ష మార్గం
ఈ కుబేర లింగము నుంచి ఈశాన్య లింగానికి వెళ్లే మార్గంలో మోక్షమార్గం ఉంటుంది.ఈ మోక్షమార్గ ప్రవేశం చేయడం వలన మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది,అనగ మోక్షం లభిస్తుందని అర్ధం.
Esanya Lingam-ఈశాన్య లింగం
అరుణగిరికి ఈశాన్య దిక్కున ఈశాన్య లింగం ఉంటుంది,ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్టించాడు.ఈ క్షేత్రానికి అధిదేవత బుధుడు. ఈ లింగం దర్శించడం వలన సంసారం, ఉద్యోగం, వ్యాపారం లో ఏమైనా సమస్యలు వస్తే తొలుగుతాయి.ఇక్కడి నుంచి 1 km ప్రయాణిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాం.ఇంతటితో గిరిప్రదక్షిణ పూర్తవుతుంది.
FAQ