Ujjain Mahakaleshwar Temple In Telugu-చితా భస్మంతో అభిషేకించె ఏకైక జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం

Ujjain Mahakaleshwar Temple In Telugu మన భారతదేశంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం. సప్త మోక్ష పురాలలో ఉజ్జయిని ఒకటి, పూర్వం ఉజ్జయిని ని అవంతి అని పిలిచేవారు .ఈ క్షేత్రంలో శివుడు మహాకాళుడి రూపంలో మనకు దర్శనమిస్తాడు. మహాకాళుడు అనగా కాలానికి అతీతుడు,మహా మృత్యు స్వరూపుడు. లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వరుడు 43 లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో ఆవిర్భవించాడు అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం మహాకాలుడి యొక్క ఆవిర్భావం, ఉజ్జయిని  ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి మరియు దర్శనవేళల గురించి తెలుసుకుందాం.

Ujjain mahakaleswar Temple

Ujjain Mahakaleshwar Temple Avirbhavam-ఉజ్జయిని మహాకాళేశ్వర ఆవిర్భావం

శివ పురాణం ఆధారంగా పూర్వం ఉజ్జయిని క్షేత్రం లో వేద ప్రియుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దేవ ప్రియుడు, ప్రియ మేదస్సుడు, సుకృతుడు & ధర్మవాహి అనే నలుగురు కుమారులు కలరు. అదే కాలంలో దూషణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం 100 సంవత్సరాలు తపస్సు చేసి లోకాలను జయించే శక్తిని వరంగా పొందుతాడు. వరం పొందిన అనంతరం వేదాలను మరియు యజ్ఞాలను నాశనం చేశాడు .ఈ భూమండలం మొత్తం తన రాక్షస సైన్యాన్ని పంపించి ఎక్కడ దేవాలయాలు, ధర్మము అనేది లేకుండా చేశాడు, కానీ ఒక్క అవంతి నగరంలో మాత్రం వేదములు, యజ్ఞాలు మరియు దైవ కార్యములు జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకొని అవంతి చేరుకుంటాడు. ఆ సమయంలో వేద ప్రియుడు మరియు అతని నలుగురు కుమారులు  శివుని యొక్క పార్థివ లింగానికి పూజచేస్తూ ఉంటారు అది చూసి ఆగ్రహించిన దూషణాసురుడు ఆ బ్రాహ్మణులను సంహరించపోతాడు .

Ujjain mahakaleswar Temple

అప్పుడు శివుడు ఆ పార్థివ లింగం నుంచి ప్రకళించుకొని మహాకాళుడి రూపంలో ప్రత్యక్షమై ఒక హుంకారం తో దూషణాసురుడుడిని  మరియు అతని సైన్యాన్ని భస్మం చేస్తాడు. దేవతలు, ఋషులు మొదలగువారు పూల వర్షం కురిపించి మహా కాళుడిని స్తుతించసాగారు. తదనంతరం ఆ బ్రాహ్మణులు అపమృత్యు భయం తొలగించి కలియుగాంతం వరకు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలసి భక్తులకు ఆశీస్సులు అందించమని మహాకాళుడిని కోరుకుంటారు. అందుకు శివుడు తధాస్తు అని పలికి  జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు.

Must Visit Temples in Ujjain-ఉజ్జయిని లో తప్పక దర్శించవలసిన ఆలయాలు 

Ujjain Mahakaleswar Bhasma Harathi-ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మ హారతి

ప్రతి రోజు ఈ మహాకాళ జ్యోతిర్లింగానికి  భస్మంతో అభిషేకం చేస్తారు, భస్మాభిషేకం రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ఆవు పిడకలు కాల్చగా వచ్చిన భస్మంతో కాని లేదంటే ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివైక్యం(మరణించడం) చెందిన వాళ్లని ఒక పదిమంది సాధువుల మధ్య అంత్యక్రియలు జరిపిన తర్వాత వచ్చిన భస్మం చేస్తారు. దేశంలో పరమేశ్వరుడికి చితా భస్మంతో అభిషేకం చేసే ఏకైక క్షేత్రం ఉజ్జయిని. భస్మాభిషేకం కొరకు ఉపయోగపడిన జీవుడు ప్రమద గణాలలో కలిసి పోతాడు అని శివుడు వరం ఇచ్చాడు. భస్మ హారతి దర్శించి ఆ చితాభస్మం ని నుదుటన ధరించడం వలన సకల పాపాలు తొలగుతాయని ప్రతీక.

Ujjain mahakaleswar Temple

How To Reach Ujjain Mahakaleswar Temple-ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం ఎలా చేరుకోవాలి

మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లో ఉంది. ఉజ్జయిని ఇండోర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో మరియు భోపాల్  నుంచి 192 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రైలు మార్గం:

మన తెలుగు రాష్ట్రాల నుంచి రైలులో రావాలనుకునేవారు వారాంతపు రైలు ద్వారా ఉజ్జయినికి నేరుగా చేరుకోవచ్చు. అవి దొరకని పక్షాన మొదట ఇండోర్ లేదా భోపాల్ కు  రైలులో చేరుకొని అక్కడి నుండి బస్సు లేద క్యాబ్లో ప్రయాణం చేసి ఉజ్జయిని ని చేరుకోవచ్చు.

విమాన మార్గం:

విమాన మార్గం ద్వారా రావాలనుకునేవారు మొదట ఇండోర్ లోని దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఎయిర్ పోర్ట్ చేరుకోవాలి.అక్కడ నుంచి బస్సు లేద క్యాబ్లో 55 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉజ్జయిని ని చేరుకోవచ్చు.

Darsan Timings:దర్శన వేళలు 

దర్శనం:

ఉదయం 04:00 AM నుంచి రాత్రి11:00 PM.

భస్మ హారతి:

ఉదయం 04:00 AM నుంచి 06:00 AM.

FAQ:

Leave a comment