Trimbakeshwar Jyotirling Temple-త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ విశిష్ఠత, భారత దేశం లో గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగం త్ర్యంబకేశ్వరం/త్రయంబకేశ్వరం. అంబక అంటే నేత్రము అని అర్ధం శివుడు మూడు నేత్రములు కలవాడు కనుక త్రయంబకేశ్వరడు అని కూడా పిలుస్తారు.ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువుతో పాటుగ శివుడు కొలువైయున్నాడు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని 1730 లో ఛత్రపతి శివాజీ గారి సైన్యాధిపతైన బాజీరావు పీష్వా నిర్మించారు. ఈ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏమిటి? గొదావరి నది యొక్క జనన వృతాంతం? మొదలగు విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Gowthama Maharshi’s Pityness-గౌతమ మహర్షి కారుణ్యం:
పూర్వం గౌతమ మహర్షి మరియు అహల్య దంపతులు దక్షిణ దిక్కు వైపున ఉన్న బ్రహ్మ గిరి పర్వతం పైన జీవనం సాగిస్తుండేవారు.అదే సమయంలో భూమి మీద 100 సంవత్సరములు వర్షం లేక కరువు ఆవహించింది. కానీ గౌతమ మహర్షి ఆశ్రమం మాత్రం సస్యశ్యామలంగా ఉండేది.ఇది తెలుసుకున్న ఋషులు, మునులు మొదలగువారు గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. కరువు ఆవహించడం వలన తాము ఆకలితో అలమటిస్తున్నామని తమను కాపాడవలసిందిగా మహర్షిని వేడుకున్నారు. అప్పుడు గౌతముడు వరుణదేవుడిని ప్రార్ధించగా వరుణుడు గౌతముడుని తన ఆశ్రమ ప్రాంగణంలో ఒక సరస్సు ఏర్పాటు చేయమని చెప్పి ఆ కొలను లో నిత్యం నీరు లభించేతట్టు చేస్తానని అని వరం ఇచ్చాడు. తదనంతరం గౌతముడు కొన్ని విత్తనాలు చల్లి ఆహారం పండించి వాళ్లకు పెట్టేవాడు.ఈ విధంగా 100 సంవత్సరాలు గడిచింది. కొంతలకాలం తర్వాత అక్కడ ఉన్న ఋషి ల భార్యలు సరస్సు వద్ద ఉండగా గౌతమ మహర్షి భార్య సంధ్యావందనం కొరకు నీరు సేకరించడానికి శిష్యులతో అక్కడికి చేరుకుంది.
Saints with Jealous-అసూయతో రగిలిన ఋషులు:
అప్పుడు శిష్యులు, ఋషుల భార్యలను కొంచెం తప్పుకోమనగా ఋషుల భార్యలు దుర్భాషలు ఆడ సాగారు. అప్పుడు అక్కడ ఉన్న అహల్య ఋషుల భార్యలను సౌమ్యంగా పక్కకు తప్పుకోమని నీరు తీసుకోని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది గమనించిన ఋషి పత్నులు అసూయతో దుర్బుద్ధి తో తమ భర్తలకు ఈ పూట మేము సరస్సు వద్ద స్నానం చేసుకొని వస్త్రములు ధరించబోతుండగా గౌతముడి ఒక్క శిష్యులు వచ్చి మమల్ని దిర్భుద్ధితో చూసారు అని, అహల్య వారిని సమర్థిస్తూ మాట్లాడిందని, మా దయ దాక్షిణ్యాలతో మీరంతా బ్రతుకుతున్నారని అవమానించిందని చెప్పరు.అదే సమయంలో నారదుడు స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు సైతం గౌతముడి యొక్క తప్పశక్తి మరియు అతని దాన దర్మాల గురించి ఇంద్ర సభలో ప్రశంసించాడని అసూయపరులైన ఋషుల ముందు కీర్తించ సాగాడు. నారదుడు గౌతముడిని కీర్తించడం వలన ఋషులు అసూయతో మరింత రగిలి పోయారు.
Gohathya Sin-గోహత్య పాపం:
ఋషులలో ఒకరు విగ్నేశ్వరుడి కోసం తప్పస్సు చేసి గౌతముడిని బ్రష్టుడిని చేయడానికి సహకారం కావాలని వరం కోరుకున్నారు. ఇలా చేయడం తగదు అని విగ్నేశ్వరుడు వారించిన వాళ్ళు వినకపోయేసరికి, ఒక వృద్ధ ఆవు రూపంలో విగ్నేశ్వరుడు గౌతముడి ఆశ్రమంలో ఉన్నపంటను తింటున్నట్టు నటించ సాగాడు. అప్పుడు గౌతముడు ఒక గడ్డి పరకతో ఆ అవును అదిలించగా అది అక్కడికక్కడే మరణించింది. అది గమనించిన ఋషులంతా మహా గోరా పాపం జరిగి పోయింది అంటూ గగ్గోలు పెట్ట సాగారు. అప్పుడు గౌతముడు తాను కేవలం ఒక గడ్డిపరక మాత్రమే వేసాను అని కానీ ఆ గోవు ఎందుకు మరణించిందో తెలియడం లేదని తాను ఇప్పుడు ఏమి చేయాలి అని ఋషులను అడిగాడు. అందుకు గోహత్య మహా పాపం అని పలికి, ఈ మహా పాపానికి ప్రాయశ్చిత్తంగ గౌతముడిని భూమి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి శివుడి వద్ద నుంచి గంగను భూమి మీదకు తీసుకు వచ్చి ఆ గంగజాలం తో ఈ ప్రాంతాన్ని శుద్ధి చేసిన తరవాత ని పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అని ఋషులు చెప్పారు.
Gowthama’s Tapassu-గౌతముని తపస్సు:
అప్పుడు గౌతముడు శివ జటాజూటంలో ఉండే గంగను భూమి మీద రప్పించడానికి ఇప్పుడు ఉన్న నాసిక్ చేరుకొని భార్య సమేతంగా కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకో మనగ తాను చేసి గోహత్య పాపానికి ప్రాశ్చితంగా గంగ దేవిని భూమి మీదకు పంపించమని అడిగాడు. అప్పుడు శివుడు నీకు ఎటువంటి పాపం లేదని ఇది ని దగ్గర ఉన్న అసూయా పరులైన ఋషులు చేసిన పన్నాగం అని వాళ్ళ పైన ఆగ్రహించాడు. గౌతముడు ఓ మహేశ్వర వాళ్ళు నాకు చాల ఉపకారం చేసారని వాళ్ళ వల్లే నాకు నీ దర్శనభాగ్యం జరిగిందని పలికి వాళ్ళు ఎంతో ఉపకారం చేసారని సంతోషించాడు. ఈ దక్షిణ భారతంలో గంగ లేక పోవడం వలన ప్రజలు అలమటిస్తున్నారు కనుక నీవు ఈ ప్రాంతం లో శాశ్వతంగా గంగ ప్రవహించే తట్టు చెయ్యి అని కోరాడు. అప్పుడు శివుడు గంగ దేవితో ఈ దక్షిణ ప్రాంతంలో గౌతముడి పేరున గౌతమిగాను మరియు గోవు మరణించిన ప్రదేశం లో ప్రవహించడం వలన గోదావరిగాను పేరుగాంచి చివరకు దక్షిణ గంగగాను ప్రసిద్ధి గాంచమని అని పలికాడు.
Curse Recieved By Saints-ఋషులు పొందిన శాపం:
అప్పుడు గంగ దేవి నేను ఈ పాత్ముల పాపాలను స్వీకరించి అనుగ్రహించలేను అని పలకగా. అప్పుడు శివుడితో పాటు ప్రత్యక్షమైన దేవతలు ఈ విధంగా పలికారు ’12 సంవత్సరాలకి ఒకసారి గురువు సింహ రాసి లో ప్రవేశించినప్పుడు నీకు పుష్కరాలు వస్తాయి, అప్పుడు సకల దేవతలు మరియు నది నదములు యొక్క శక్తీ నీలో ఉంటుంది కనుక నీలో ఉన్న పాపం తొలగిపోతుందని చెప్పారు’. అప్పుడు గంగ దేవి సర్వులను అనుగ్రహించాడదానికి నాతో పాటు మీరందరు నది తీరం వెంబడి వెలియాలని కోరగా దేవతలు తధాస్తు అని పలికారు. తదనంతరం గౌతముడితో గంగ దేవి నేను ఎంత మందినైనా క్షమించగలను కానీ కృతఘ్నులును మాత్రం క్షమించలేను అని నివు వాళ్ళని శపించు అని పలికింది. అప్పుడు గౌతముడు ఆగ్రహంతో ఋషులను సకల పాపాలు పొందుతారని అనగా నీచ దానాలు పుచ్చుకొనుదురు, మద్యపానం మొదలగు వ్యసనాల బారిన పడదురు మరియు వాళ్ళ వంశాలలో తరచుగా దౌర్భాగ్యులు పుట్టుదురు అని శపించాడు.
PhalaSruthi-ఫలశృతి:
తదనంతరం గంగ గౌతముడి వెంట కదలగా గోహత్య పాపం నుంచి సాంత్వన పొందాడు.ఆ తర్వాత ఈశ్వరుడిని తాను తపస్సు చేసిన ప్రదేశంలో జ్యోతిర్లింగంగా వెలిసి కలియుగాంతం వరకు భక్తులను అనుగ్రహించాలని కోరుకున్నాడు. అప్పుడు శివుడు ఈ ప్రదేశంలో నేను త్రయంబకేశ్వరుడిగా వెలుస్తానని తనని దర్శించిన ప్రజలకు గోహత్య పాపం మరియు కృతఘ్నుత పాపం తొలగిస్తానని వరం ఇచ్చాడు.
Kusavarth Kund-కుశావర్త కుండం / తీర్ధం:
త్రయంబకేశ్వర ఆలయం నుంచి 400 మీటర్ల దూరం లో కుశావర్త కుండం / తీర్ధం ఉంటుంది. ఈ కుండంలో స్నానం ఆచరించడం వలన సర్వ పాపాలు, రోగాలు తొలగుతాయి. ప్రతి 12 ఏళ్ల కు జరిగే కుంభమేళా ఈ ప్రదేశం లో కూడా జరుగుతుంది. జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లేముందు ఇక్కడ స్నానం ఆచరించడం మంచిది. త్రయంబకేశ్వర ఆలయం నుంచి 10 కిలో మీటర్ల దూరంలో బ్రహ్మ గిరి పర్వతం వద్ద గోదావరి నది జన్మస్థానం ఉంటుంది.గొదావరి నది బ్రహ్మ గిరి పర్వతంపైన అదృశ్యమై తిరిగి ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది. ఇంతటితో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ వృతాంతం సమాప్తం.