Srisailam Temple In Telugu శివ అనగా కల్మషం లేనివాడు అని ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు అటువంటి శివుడు పన్నెండు క్షేత్రాల్లో జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు.జ్యోతిర్లింగాల్లో ద్వితీయ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరోశక్తి పీఠం,ఈ రెండు కలగలిసిన దివ్య క్షేత్రం శ్రీశైల క్షేత్రం.ఈ నల్లమల అడవుల్లో అమ్మవారు అయ్యవారు స్వయంబుగా వెలిశారు.శివుడు మరియు శక్తీ ఇద్దరు ఒకే చోట ఉండటం వల్ల ఈ ప్రదేశం శివశక్తి క్షేత్రంగా పేరు గాంచింది.ఇప్పుడు మనం శ్రీశైల మల్లికార్జునుడు మరియు భ్రమరాంబల యొక్క ఆవిర్భావం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
Srisailam Mallikarjuna Avirbhavam-శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ ఆవిర్భావం
స్కంద పురాణం ప్రకారం గణపతికి గణాధ్యక్ష పదవి ఇవ్వడం వలన కలత చెందిన కుమారస్వామి భూలోకం వచ్చి క్రౌంచ పర్వతం(శ్రీశైల శిఖరం)వద్ద తపస్సు చేసుకుంటు శ్రీశైల అరణ్యములో సంచరించేవాడు.ఆ అరణ్యములో ఒక బోయవారి కుమార్తె అయినటువంటి వల్లిని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు.వల్లిదేవి ఆదిశేషుని యొక్క మనుమరాలు, బోయవాణి యొక్క భక్తికి మెచ్చిన ఆదిశేషుడు వెల్లిదేవిని కుమార్తెగా పంపించాడు. కుమార స్వామి తన వివాహం కొరకై శివపార్వతుల కోసం తపస్సు చేయగా ఆది దంపతులు ప్రతక్షమయ్యారు.కుమారి స్వామి కళ్యాణం కొరకు సకల దేవతలు అక్కడికి వచ్చారు,కళ్యాణం అనంతరం దేవతలు స్వామి వారిని ఈ శ్రీశైలం లో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి కలియుగాంతం వరకు భక్తులకు ఆసిర్వచనాలు ఇవ్వవలసినదిగా కోరుతారు.అందుకు శివుడు అంగీకరించి జ్యోతిర్లింగంగా అవిర్భవించాడు.
Places to visit in Srisailam Part-1-శ్రీశైల క్షేత్ర మహిమలు మొదటి భాగం
Srisailam Bhramarambha Devi Avirbhavam-భ్రమరాంబ దేవి ఆవిర్భావం
పురాణాల లోని దేవి భాగవతం ఆధారంగా పూర్వకాలంలో అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వీడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఆరు కాళ్లు కలిగిన స్త్రీ జంతువు వల్లే నాకు మృత్యువు రావాలని కోరుకుంటాడు అందుకు బ్రహ్మ అంగీకరించాడు.వరం పొందిన తదనంతరం అరుణాసురుడు విజృంభించి ముల్లోకాలను జయించి అందరినీ బాధించసాగాడు.ఇది గమనించిన దేవతలు తమను రక్షించమని పరాశక్తిని వేడుకోసాగారు అందుకు అమ్మ ఆరు కాళ్ల స్త్రీ జంతువుగా(భ్రమరము) ఆవిర్భవిస్తుంది.భ్రమరము అనగా తుమ్మెద అలా అమ్మవారు భ్రమరాంబగా మారి అరుణాసురుడిని సంహరించింది, తదనంతరం ఇక్కడే శిలా రూపంగా కొలువై భక్తులకు ఆసిర్వచనాలు ఇస్తుంది.
Sakthi Peetam-శక్తి పీఠం
శివుని పట్ల ద్వేషం తో శివుడులేకుండా దక్షుడు యజ్ఞం నిర్వహిస్తాడు ఆ యజ్ఞానికి సకల దేవతలను ఆహ్వానిస్తాడు, కానీ సొంత అల్లుడైన శివుడిని మాత్రం ఆహ్వానించడు.ఆహ్వానం లేకుండా దక్షయజ్ఞ్యానికి వెళ్లి తండ్రిచే అవమానితురాలు అయిన సతీదేవి చాలా దుఃఖించి అక్కడే అగ్నికి ఆహుతి అవుతుంది.అది తెలుసుకున్న శివుడు వీరభద్రుడిని పంపి దక్షయజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు తదనంతరం సతి దేవి శరీరాన్ని తన భుజం మీద వేసుకొని శివతాండవం చేయగా లోకాలన్నీ కంపించసాగాయి. ఇది గమనించిన శ్రీ మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతి దేవి శరీరాన్ని ఖండించడంతో శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి.ఆ ప్రదేశాలన్నిశక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. సతి దేవి శరీరంలోని మెడ భాగము భ్రమరాంబిక దేవి విగ్రహం లో కలిసిపోయి శక్తి పీఠంగా ప్రసిద్ధి గాంచింది.
Places To Visit In Srisailam Part-2-శ్రీశైల క్షేత్ర మహిమలు రెండవ భాగం
How to reach Srisailam-శ్రీశైలం ఎలా చేరుకోవాలి
శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లోని నంధ్యాల జిల్లాలో దట్టమైన అడవుల మధ్య కృష్ణ నది ఒడ్డున ఉంది.
1.బస్సు సౌకర్యం:
మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలంకు వెళ్ళాలి అనుకునేవారికి ఆర్.టి.సి మరియు ప్రైవేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
2.రైలు సౌకర్యం:
రైలు ప్రయాణం చేయాలనుకునే వారు రైలు ద్వార ముందుగా మార్కాపూర్ రోడ్ స్టేషన్ చేరుకోవాల్సి ఉంటుంది.,అక్కడ నుంచి బస్సు ద్వారా 85 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీశైలం చేరుకోవచ్చు.
3.విమాన సౌకర్యం:
విమాన ప్రయాణం చేయాలనుకునే వారు విమానంలో ముందుగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది.అక్కడ నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 217 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీశైలం చేరుకోవచ్చు.
Darshan Timings-దర్శన వేళలు
దర్శనం:ఉదయం 04:30 AM నుంచి రాత్రి 9:00 PM
స్పర్శ దర్శనం(500 RS): ఉదయం 6AM నుంచి మధ్యాహ్నం 3:00PM తిరిగి సాయంత్రం 6:00PM నుంచి రాత్రి 10:00PM
ఉచిత స్పర్శ దర్శనం: మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:00PM నుంచి 4:00 PM వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుంది శని ఆదివారాల్లో రద్దీ వలన ఉచిత స్పర్శ దర్శనం ఉండదు.
FAQ: