Somnath Jyothirlinga In Telugu శివ పురాణం ఆధారంగా ప్రభాస క్షేత్రం లో జరిగిన వృతాంతం మరియు చంద్రుడు శాపగ్రస్తుడు కావడానికి గల కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు వారిలో మొదటి 27 కుమార్తెలను(నక్షత్రాలు) చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు.కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చంద్రుడు కేవలం ఒక్కరి(రోహిణి) పట్లే అనురాగంగా ఉండేవాడు. తక్కిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించసాగాడు.అందుకు తక్కిన 26 మంది ఎంతో దుఃఖించి తమ తండ్రిగారైన దక్ష ప్రజాపతిని ఆశ్రయించి జరిగిన వృతాంతం వివరించారు.అందుకు దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి పిలిచి మందలిస్తాడు,తదనంతరం చంద్రుడు ఇక నుంచి పక్షపాతం చూపించను అని చెప్పి వెళ్ళిపోతాడు. కాని కొన్ని రోజులకి మళ్లీ యధా ప్రకారం రోహిణి పట్ల అనురాగంగా ఉంటూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేయసాగాడు.
Somnath Jyothirlinga Prathistapana-సోమనాథ జ్యోతిర్లింగం ప్రతిష్ఠాపన
చంద్రుని యొక్క తీరుకు ఆగ్రహించిన దక్షుడు నీకు క్షయ రోగం వచ్చుగాక అని శపిస్తాడు.వెంటనే చంద్రుడు క్షయరోగగ్రస్తుడైపోతాడు.చంద్రుడు క్షీణించుకోవడం వల్ల పంటలు పండటం లేదు,యజ్ఞాలు జరగడం లేదు మరియు వర్షాలు కురవడం లేదు అందుచేత లోకమంతా కరువు ఆవహించింది.దానితో దేవతలు అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లి జరిగిన వృత్తాంతం విన్నవించుకున్నారు.అప్పుడు బ్రహ్మదేవుడు ఇతడికి రోగ విముక్తి కలగాలంటే ఈశ్వర ఆరాధన ఒక్కటే మూలం అని చెప్తారు.తదనంతరం దేవతలంతా భూలోకంలో ఉన్న ప్రభాస క్షేత్రం చేరుకుని చంద్రుని చేత ఒక అపూర్వమైన పార్థివలింగాన్ని ప్రతిష్టింపచేశారు.తర్వాత చంద్రుడు మృత్యుంజయ మంత్రాన్నిస్మరిస్తు ఆరు నెలలు నిరంతరం తపస్సు చేశాడు.తదనంతరం శివుడు ప్రత్యక్షమైయి ఏ వరం కావాలో కోరుకోమంటాడు.
Somnath Temple In Telugu-సోమనాథ ఆలయం
Sapavimochan to chandra bhagavan-చంద్రునికి శాప విమోచనం
అప్పుడు చంద్రుడు ఈ క్షయ రోగం నుంచి విముక్తి చేయమని కోరుతాడు.అందుకు శివుడు దక్షుడు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటే అది దోషం అవుతుంది,కనుక నీ రోగాన్నిమార్పు చేస్తున్నాను అని చెప్పి, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు కాని నీ చంద్రకళలకు మాత్రం వృద్ధి క్షయాలు ఉంటాయి అని. అలాగే నీ చంద్రకళలు శుక్లపక్షంలో పెరుగుతాయి మరియు కృష్ణపక్షంలో తరుగుతాయి అని వరం ఇస్తాడు.వెంటనే చంద్రుడు పూర్వం కంటే ఆరోగ్యంగా షోడశ కళా ప్రపూర్ణుడవుతాడు.తదనంతరం దేవతలు, బ్రహ్మదేవుడు మరియు ఋషులు అక్కడ ప్రత్యక్షమై శివునికి భక్తితో నమస్కరించి ఈ విధముగా పలుకుతారు.భూలోకంలో ఉన్న మానవులు నిరంతరం ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు.అటువంటి మానవుల కోసం ఈ పార్థివలింగాన్ని జ్యోతిర్లింగంగా మార్చమని కోరతారు. అందుకు శివుడు ఈ లింగాన్ని సోముడు(చంద్రుడు) ప్రతిష్టించాడు కనుక సోమేశ్వర లింగం/సోమనాథ లింగంగా ప్రసిద్ధి చెందుతుంది అని అలాగే కలియుగాంతం వరకు కొలువై భక్తులకు ఆశీర్వచనాలు ప్రసాదిస్తుంది అని బదులిస్తాడు.
Somnath Jyothirlinga blessings for People-సోమనాథుని దర్శనం వళ్ళ కలిగే ఫలితం
తదనంతరం దేవతలకు చంద్రుని పేరు మీదగా చంద్ర కుండం ఏర్పాటు చేయమని చెప్పి,ఆ కుండలో స్నానం చేయడం వలన సమస్త రోగాలు మరియు సమస్త పాపాలు నశిస్తాయి అని వరం ఇస్తాడు.అంతేకాకుండా సోమవారం రోజు కానీ పౌర్ణమిరోజు కానీ కార్తీక మాసంలో కానీ సోమనాధుని దర్శించుకుంటే ఉత్తమ తీర్థాలు దర్శించిన ఫలితం మరియు అనేక దానాలు చేసిన ఫలితం లభిస్తుందని చెప్తాడు. గ్రహణం రోజు కనుక సువర్ణ దానం చేసి సోమనాధుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు,ఇది పరమ పవిత్రమైన సోమేశ్వర లింగ విశేషం.
FAQ: