Rameshwaram Temple మనదేశంలో ఉన్న చార్ ధామ్ లలో ఒకటిగా, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఏడవదిగా రామేశ్వరం జ్యోతిర్లింగం విరాజిల్లుతుంది. తమిళనాడు రాష్ట్రం లోని బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో పరమశివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై భక్తుల చేత విశిష్ట పూజలు అందుకుంటున్నారు. బంగాళాఖాతాన్ని ప్రాచీన కాలంలో పూర్వ సముద్రంగా వ్యవహరించేవారు, శ్రీరామచంద్రుని పాద స్పర్శతో ఈ ప్రదేశం పునీతమైనది. ఇప్పుడు మనం ఈ రామలింగేశ్వర జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించింది ? ఈ లింగాన్ని ఎవరు ప్రతిష్టించారు ?సంపూర్ణ రామలింగేశ్వర జ్యోతిర్లింగ దర్శన ఫలితం ఎలా లభిస్తుంది ? మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Sri Rama Avathar-శ్రీ రాముడిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు
శివపురాణం మరియు రామాయణం ఆధారంగా జరిగిన కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రావణాసురుడి అకృత్యాల నుంచి రక్షించమని దేవతలు వైకుంఠం చేరుకున్నారు. అలాగే రావణాసురుడు పొందిన వరాల గురించి విష్ణువుకి చెప్పి ఆ రాక్షసుడి నుంచి లోకాలని కాపాడమని విష్ణువుని కోరారు. అప్పుడు విష్ణువు తాను నరుడుగా అవతరించి లోకాలని రక్షిస్తానని అభయం ఇస్తాడు. తదనంతరం త్రేతాయుగం చివరి పాదంలో రాముడిగా జన్మించాడు పిదప సీతాదేవిని కళ్యాణం చేసుకొని 14 సంవత్సరములు వనవాసం చేసాడు. చివరి సంవత్సరం లో రావణాసురుడు సీత దేవిని అపహరించాడు,రాముడు సీత దేవి జాడ కొరకు వెతుకుతూ ఋష్యమూక పర్వతం చేరుకున్నాడు. అక్కడ సుగ్రీవుడు వాలి మధ్య ఉన్న వైరం చూసి ధర్మం వైపు నిలిచి వాలిని సంహరించి సుగ్రీవుడిని రాజు చేసి సీతదేవి అన్వేషణ కొరకై వానరులను నలువైపులా పంపాడు.
Sykatha Lingam By Rama-రాముడు చేసిన సైకత లింగం
హనుమంతుడు సీతదేవి జాడ కనుగొని లంక నగరంలో సీతమ్మ ఉన్నది అని పలకగా రాముడు వానరులతో కలిసి దక్షిణ సముద్రం చేరుకున్నాడు.ఆ సముద్రం చేరుకున్న రాముడుకి దాహం వేయగా స్వచ్ఛమైన నీరుని తీసుకురమ్మని లక్ష్మణుడిని అడిగాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు తాను తీసుకువస్తానని పలికి కైలాసం చేరుకుని శివుడిని రాముడి కోసం జలం కోరగా శివుడు తన జటాజూటం లోని గంగ జలాన్నిఇచ్చాడు. హనుమంతుడు ఆ జలం తీసుకొని తిరిగి రాముడు వద్దకు చేరుకున్నాడు .అప్పుడు రాముడు కైలాసం నుంచి వచ్చిన జలాన్ని ముందు శివుడికి సమర్పించి తర్వాత తను స్వీకరించాలని అనుకున్నాడు .అప్పుడు రాముడు ఇసుకతో ఒక సైకత లింగాన్ని చేసి అభిషేకించగా ఆ లింగం నుండి శివుడు ఉద్భవించాడు. అనంతరం శ్రీరాముడు శివుడుని పలు విధాలుగా స్తుతించారు.
Sykatha Lingam By SitaRama-సీతరాముల చేత ప్రతిష్ఠించ బడిన సైకత లింగం
శ్రీరాముడు భక్తికి మెచ్చిన శివుడు రావణ సంహారం జరిగి నీవు తిరిగి ఇక్కడికి వచ్చేంతవరకు నేను ఈ లింగంలో కొలువై ఉంటాను అని పలకగ, అందుకు రాముడు శివుడుని కలియుగాంతం వరకు ఇక్కడే కొలువై ఉండాలి అని కోరాడు. అందుకు శివుడు నువ్వు సీతా సమేతంగా మరియొక లింగాన్ని ప్రతిష్ఠించు అప్పుడు నేను ఆ లింగంలో కలియుగాంతం వరకు ఉంటాను అని పలికి అదృశ్యమయ్యాడు. తదనంతరం వారధి కట్టి లంక చేరుకుని రావణుడిని సంహరించి సీతా సమేతంగ తిరిగి దక్షిణ సముద్రం చేరుకున్నాడు. దక్షిణసముద్రం ఒడ్డున్న చేరుకున్న రాముడు జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాలిని భావించి శివుడు నుంచి జ్యోతిర్లింగం తీసుకురమ్మని ఆంజనేయస్వామిని కైలాసం పంపించాడు.కైలాసం నుంచి జ్యోతిర్లింగం వచ్చేసరికి ముహూర్తం గడిచిపోవడం వలన సీతాదేవి ఒక సైకత లింగాన్ని చేయగా రాముడు సీతా సమేతంగా సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు,అంతకుపూర్వం రాముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఈ లింగంలో కలిసిపోయినది.
Rameswara Lingam-రామ+ఈశ్వర=రామేశ్వర లింగం
ఈ లింగాన్ని ప్రతిష్టించగానే కోటి సూర్యుల యొక్క జ్యోతితో ఆ లింగం ప్రకాశించింది. రాముడి చేత ప్రతిష్ఠింపబడిన లింగం కనుక రామ+ఈశ్వర రామేశ్వర లింగం గా ప్రసిద్ధి గాంచింది. తదనంతరం సీత సమేత రాముడు లింగాన్నిఅభిషేకిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కైలాసం నుంచి జ్యోతిర్లింగాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఆంజనేయుడు ‘స్వామి నేను తీసుకొచ్చిన లింగాన్ని మీరు ప్రతిష్ఠించాలి’, అని పలికి సీతారాములు ప్రతిష్ఠించిన లింగాన్ని తన తోకతో ప్రకలించ సాగాడు. ఆ లింగం కొంచెం కూడా కదలలేదు అప్పుడు ఆకాశం నుంచి ఈశ్వరుడు సీతారాముల చేత ప్రతిష్ఠించిన లింగాన్ని నువ్వు ప్రకలించలేవు అని పలికి తాను ఇచ్చిన జ్యోతిర్లింగాన్ని శ్రీ రాముడు ప్రతిష్ఠించిన లింగం ఎదురుగా పెట్టి పూజించమని పలికాడు.అది స్పటిక లింగంగా కలియుగాంతం వరకు భక్తులకు దర్శనమిస్తుంది అని చెప్పాడు. అలాగే రామేశ్వరం చేరుకున్న వారు సీతారాముల చేత ప్రతిష్ఠించిన లింగంతో పాటు ఈ కైలాసం నుంచి వచ్చిన స్పటిక జ్యోతిర్లింగాన్ని కూడా దర్శిస్తేనే సంపూర్ణ రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం లభిస్తుంది అని వరం ఇచ్చాడు.
Phalasruthi-ఫలశృతి
ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించిన యెడల జ్యోతిర్లింగ దర్శన పుణ్యమే కాకుండా వైకుంఠంలో ఉన్న లక్ష్మీ సమేత విష్ణువులను దర్శించిన పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా కాశీ కి వెళ్లి కాశీ విశ్వనాథుని దర్శించుకుని తదనంతరం గంగా జలం తీసుకొని తిరిగి రామేశ్వరం చేరుకుని రామేశ్వర లింగం మీద అయినా లేదంటే రామనాథ స్వామి ఆలయంలో ఉన్న ఏ లింగం మీదైన అభిషేకం చేసి, ఆ అభిషేకించిన జలాన్ని తీసుకుని సముద్రంలో కలిపిన యెడల గంగానదిని తీసుకొచ్చిన భగీరథుడికి వచ్చిన పుణ్యం మనకు లభిస్తుంది. కాశీ రామేశ్వర యాత్ర చేయడం వలన మొత్తం జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం మరియు భూమండలంలో ఉన్న అన్ని తీర్థం క్షేత్రాలు దర్శించిన ఫలితం లభిస్తుంది. అంత్యకాలంలో శివజ్ఞానం పొంది జీవన్ముక్తుడు అవుతాడు అని శివుడు వరమిచ్చాడు.
FAQ: