Places To Visit In Srisailam Part-2 శివుడు జనన మరణాలకు, కాలానికి వశమయ్యేవాడు కాదు అందుకే పరమశివుడిని సదాశివుడు అని అంటారు. సౌరాష్ట్రే సోమనాదంచ అని ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చే రెండవ జ్యోతిర్లింగమే శ్రీశైల మల్లికార్జునం. శ్రీశైల క్షేత్ర మహిమలు మొదటి భాగంలో సాక్షి గణపతి ఆలయం,ఫాలధార పంచదార,హటకేశ్వరం,లలితా దేవి పీఠం మరియు శ్రీశైలశిఖరం మొదలగు ప్రదేశాలు గురించి తెలుసుకున్నాము.ఇప్పుడు మనం మల్లికార్జున స్వామి ఆలయం వెనుక వైపు ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రం,మల్లమ్మ కన్నీరు ఆలయం,ఇష్టకామేశ్వరి ఆలయం,అక్కమహాదేవి గుహలు మరియు మఠాలు మొదలగువాటి గురించి ఈ రెండవ భాగం లో తెలుసుకుందాం.ముందుగా శివాజీ స్ఫూర్తి కేంద్రం గురించి తెలుసుకుందాం,నంది సర్కిల్ నుంచి శివాజీ స్ఫూర్తికేంద్రం ఒకటిన్నర కిలొమీటరు దూరంలో ఉంటుంది.
Sivaji Spurthi kendram-శివాజీ స్ఫూర్తి కేంద్రం
ముస్లింల దండయాత్ర అధికంగా ఉన్న సమయంలో శివాజీ శ్రీశైలం సందర్శించారు. శివాజీ ఒక రోజు అక్కడ అమ్మవారి కోసం ధ్యానం చేయగా భవాని రూపంలో భ్రమరాంబికా దేవి వచ్చి ఖడ్గాన్ని బహుకరించి ఆశీర్వదించింది. నాటి నుంచి ఛత్రపతి శివాజీ మరిన్ని విజయాలను అందుకున్నాడు ఏ యుద్ధం చేసినా అందులో గెలుపు శివాజీదే అయ్యేది. దానికి గుర్తుగా ఆయన అనుచరులు ధ్యాన మందిరం ఏర్పాటు చేశారు.ఈ ధ్యాన మందిరం పక్కనే శివాజి స్ఫూర్తి కేంద్రం ఉంటుంది లోపలికి వెళ్ళగానే శివాజీ దర్బార్ ఉంటుంది గోడల పైన శివాజీ జీవిత చరిత్ర అద్భుతంగా చిత్రీకరించి ఉంటుంది.శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి మల్లమ్మ కన్నీరు ఆలయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇప్పుడు మనం మల్లమ్మ కన్నీరు ఆలయం గురించి తెలుసుకుందాం.
Places To Visit In Srisailam Part1-శ్రీశైల క్షేత్ర మహిమలు మొదటి భాగం
Mallamma Temple-మల్లమ్మ కన్నీరు ఆలయం
మల్లమ్మ శివ భక్తురాలు, నాగిరెడ్డి గౌరమ్మ అనే దంపతులకు శ్రీశైల మల్లికార్జునుడి అనుగ్రహంతో మల్లమ్మ జన్మించింది. మల్లమ్మ యుక్త వయస్సుకి వచ్చాక ధర్మారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె భర్త చెప్పుడు మాటలు విని ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు చివరికి శ్రీశైల మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జరిగిన విషయం తెలుసుకొని మనసు మార్చుకుంటాడు.ఇదంతా జరిగిన తర్వాత మల్లమ్మకు ప్రాపంచిక జీవితం పట్ల వ్యామోహంపోయి శ్రీశైలం చేరుకుంది. అక్కడ గోశాల నిర్వహిస్తూ వచ్చిన వారికి అన్నదానం చేస్తు ప్రతి ఒక్కరికి శివతత్వాన్ని ప్రబోధించేది. ఈ ప్రదేశం లోనే మల్లమ్మ కు శివుడి దర్శనం కలిగి తన కంటి నుంచి ఆనందభాష్పాలు (నీరు) వచ్చి శివైక్యం చెందారు.అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని మల్లమ్మ కన్నీరుగా పిలవడం జరిగింది.తదనంతరం పంచముఖ శివలింగం గురించి తెలుసుకుందాం. మల్లమ్మ కన్నీరు ఆలయం నుంచి పంచముఖ శివలింగం 0.5 కిలొమీటరు లోపే ఉంటుంది.
Panchamukha Siva Lingam-పంచముఖ శివలింగం
ఈ శివలింగం చాలా పురాతనమైనది ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో నిర్మించారు. ఈ పంచముఖ శివలింగానికి చుట్టూ నాలుగు ముఖాలు ఉంటాయి మరియు శివలింగంతో కలుపుకొని పంచముఖాలుగా చెబుతారు నాలుగు ముఖాలు ఉన్నాయి కాబట్టి దీన్ని బ్రహ్మాలింగం అని కూడా పిలుస్తారు. ఎంతోమంది సిద్ధులు ఆదిశంకరాచార్యులు మరియు దత్తాత్రేయ స్వామి వారు కూడా ఈ స్వామివారిని దర్శించారట. ఈ ఆలయాన్ని దత్త పీఠంగా కూడా చెబుతారు. పంచముఖ శివాలయ అనంతరం రుద్రాక్ష మఠం గురించి తెలుసుకుందాం. పంచముఖ శివాలయం నుంచి రుద్రాక్ష మఠం 0.5 కిలోమీటర్ల లోపే ఉంటుంది.
Rudraksha matam & Virabhadra Swamy Temple-రుద్రాక్ష మఠం & వీరభద్ర స్వామి ఆలయం
శ్రీశైలంలోని పంచ మఠాలల్లో రుద్రాక్ష మఠం ఒకటి, కొంతమంది దుండగులు బంగారాన్ని దోచుకుని 5 మఠాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు ఆ 5 మఠాలను తిరిగి పునఃనిర్మిస్తున్నారు ప్రస్తుతం రుద్రాక్ష మఠం పూర్తయింది. పూర్వం రుద్రమనేశ్వరుడు అనే రుషి ఇక్కడ తపస్సు చేసే వాడట మహాశివరాత్రి కి మఠంకి వచ్చే భక్తులకు రుద్రాక్షలను ఇచ్చేవారట అందుకని భక్తులు ఈ మఠంని రుద్రాక్ష మఠంగా పిలుస్తారు.
చివరిగా బైలు వీరభద్ర స్వామి ఆలయం సందర్శిద్దాం,రుద్రాక్ష మఠం నుంచి బయలు వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంటుంది. బైలు వీరభద్రేశ్వర స్వామి శ్రీశైలం యొక్క క్షేత్రపాలకుడు.శ్రీశైలంలో కొత్త వాహనాలు కొన్నవారు ఈ ఆలయంలోనే పూజ చేయించుకుంటారు.ఇంతటితో మల్లికార్జున స్వామి ఆలయం వెనక వైపు ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకున్నాము .తదనంతరం ఇష్టకామేశ్వరి ఆలయం గురించి తెలుసుకుందాం.
Srisailam Temple In Telugu-శ్రీశైలం చరిత్ర
Istakameswari Temple-ఇష్టకామేశ్వరి ఆలయం
శ్రీశైలశిఖరం నుంచి ఇష్టకామేశ్వరి ఆలయం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఆలయం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది.మన దేశంలోనే ఇష్టకామేశ్వరిదేవి కొలువైయున్న ఏకైక ఆలయం శ్రీశైలంలో మాత్రమే ఉంది.జగద్గురు ఆదిశంకరాచార్యులతో పాటు ఎంతోమంది సిద్ధులు,కపాలికులు అమ్మవారిని దర్శించుకుని ఇక్కడే సాధన చేసి వరాలు పొందారట. భక్తులు అమ్మవారి నుదుటిన బొట్టు పెట్టి తమ కోరికల్ని కోరుకుంటారు. ఇక్కడొక విశేషం ఉంది అదేమిటనగా అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగా ఉన్న నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుంది. తదనంతరం పాతాళ గంగ చేరుకొని అక్కడ నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్క మహాదేవి గుహలు చేరుకుంటాం.
Akka Mahadevi Caves-అక్కమహాదేవి గుహలు
అక్కమహాదేవి కర్ణాటకలో జన్మించింది ఈమె పరమ శివభక్తురాలు మరియు సుందరవనిత. ఈమెను చూసిన ఒక రాజుగారు ఆమెను వివాహం చేసుకోవాలని పట్టుబడతాడు లేదంటే ఆమె కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించసాగాడు. అందుకు ఆమె అతి కష్టంగా అంగీకరించింది. కానీ రాజు ఒక రోజు అక్కమహాదేవి పూజ చేసుకుంటూ ఉండగా ఆమెను బలత్కరించబోయాడు అప్పుడు అక్క మహాదేవి ఆగ్రహంతో కన్నెర్ర చేయడంతో అతను భస్మం అయిపోయాడు. అప్పటి నుంచి శరీర వ్యామోహం విడిచి శ్రీశైలం చేరుకొని జీవనం సాగించేది . అక్కమహాదేవి కృష్ణానది ఆవల వైపు ఉన్న గుహలలోతపస్సు చేసి శివైక్యం చెందారు. అందుకని ఈ గుహలను అక్కమహాదేవి గుహలు అని అంటారు .మనం మల్లికార్జున ఆలయంలోకి వెళ్లేటప్పుడు ఒక చోట అక్క మహాదేవి యొక్క విగ్రహం ఉంటుంది గమనించగలరు, ఆవిడ పేరు మీద అక్క మహాదేవి మండపం కూడా కట్టించారు సందర్శించగలరు.