Places To Visit In Srisailam Part-1 శ్రీశైలం క్షేత్రం ఎంతో మంది సిద్ధుల నిలయం.ఈ క్షేత్రం లో ఎంతో మంది తపస్సు చేసి శివైక్యం చెందారు.అటువంటి మహనీయుల గురించి వారు నడియాడిన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా శ్రీశైలం నుంచి శిఖర దర్శనం వైపు వెళ్ళేటప్పుడు దర్శించవలసిన ప్రదేశాలు గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.శ్రీశైలం నుంచి శ్రీశైల శిఖరం 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది.ఈ మార్గంలో సాక్షి గణపతి ఆలయం,ఫాలధార పంచదార,హటకేశ్వరం,లలితా దేవి పీఠం మరియు శ్రీశైలశిఖరం మొదలగు ప్రదేశాలు దర్శించవచ్చు ముందుగా సాక్షి గణపతి ఆలయం చేరుకుందాం.
Sakshi Ganapathi Temple-సాక్షి గణపతి ఆలయం
శ్రీశైలం లోని నంది సర్కిల్ నుంచి రెండున్నర కిలోమీటర్లు దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంటుంది.సాక్షి గణపతి ఆలయంలో గణపతి ఆసీన రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు.సాక్షి గణపతి శ్రీశైలం యాత్రకు మొదటి సాక్ష్యం.భక్తులు శ్రీశైలం సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెప్తాడు,కనుక ఈ గణపతిని సాక్షి గణపతిగా పిలుస్తారు.తదనంతరం ఫాలధార పంచధార చేరుకుందాం. ఈ సాక్షి గణపతి ఆలయం నుంచి ఫాలధార పంచధార ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది.
Places to Visit In Srisailam Part-2-శ్రీశైల క్షేత్ర మహిమలు రెండవ భాగం
Phaladhara & Panchadhara-ఫాలధార పంచధార
ఒకప్పుడు శివుడు ఇక్కడ నీళ్లు లేకపోయేసరికి మూడో కన్ను తెరచి నుదురు నుండి నీళ్లు సృష్టించారు.నుదురు అంటే సంస్కృతంలో ఫాలము,శివుని యొక్క ఫాలము నుంచి వచ్చిన నీరు కనుక ఫాలధార అని అది కొండ మీద పడి పంచ ధారలైంది కనుక ఈ ప్రదేశాన్ని పాలధార పంచదారగా పిలుస్తారు.ఈ ప్రదేశంలోనే ఆదిశంకరాచార్యులు తపస్సు చేసి సౌందర్యలహరిస్తోత్రం రచించారు.ఈ ఫాలధార పంచధార ప్రక్కనె ఆదిశంకరాచార్యుల ఆలయం ఉంటుంది, ఆలయంలోపల ఆదిశంకరాచార్యుల పాదాల గుర్తులు, శారదా దేవి మరియు ఆదిశంకరాచార్యులు దర్శనం ఇస్తారు.తదనంతరం హటకేశ్వరం చేరుకుందాం.ఈ పాలధార పంచదార నుంచి 0.5 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకు హటకేశ్వరం మరియు లలితా పీఠం ఉంటాయి.
Hatakeswara temple & Lalitha Pitam-హటకేశ్వరం మరియు లలితా పీఠం
శ్రీశైలంలో కుమ్మరి కులానికి చెందిన కేశప్ప అనే వ్యక్తి శ్రీశైలం వచ్చే యాత్రికులకు ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉండేవాడు.శివయ్య దర్శనానికి వెళ్లే వాళ్ళు అక్కడ భోజనం చేసి అతని సేవల గురించి ప్రశంసించేవారు.అది చూసి ఓర్వలేని చుట్టుపక్కల వాళ్ళు ఒక రాత్రిపూట మాటు వేసి ఆయన ఇంట్లో ఉన్న కుండలను మరియు వాటిని తయారు చేసే సామాగ్రి మొత్తం ధ్వంసం చేస్తారు.తెల్లవారితే శివరాత్రి పర్వదినం ఆ రోజు ఎంతో మంది భక్తులు రాసాగారు చుట్టుపక్కల వాళ్ళు కేశప్ప యొక్క ప్రతిష్టను భంగపరచడానికి ఆ ఊరికి వచ్చిన యాత్రికులని కేశప్ప దగ్గరకు పంపించ సాగారు.వచ్చిన యాత్రికులకు ఎలా భోజనం ఏర్పాటు చేయాలో తెలియక కన్నీళ్లు పెట్టుకున్నాడు కేశప్ప.
Srisailam Temple In Telugu-శ్రీశైలం చరిత్ర
అప్పుడు పగిలి ఉన్న అటికలో పరమ శివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్లి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్తాడు.శివుడికి నమస్కరించి లోపలికి వెళ్ళిన కేశప్పకు అక్కడ కుండలలో వివిధ రకాల పంచ పరమాన్నాలు కనిపించ సాగాయి అప్పుడు అయన సంతోషంతో యాత్రికులకు వడ్డించాడు.శివుడు అటికలో ప్రత్యక్షమయ్యాడు కనుక అటకేశ్వరుడు అని కాలక్రమేన హటకేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు.ఆ పక్కనే సుబ్రమణ్య స్వామి ఆలయం మరియు లలితాదేవి పీఠం ఉంటాయి దర్శించండి. తదనంతరం శిఖరేశ్వరాలయం చేరుకుందాం,హటకేశ్వరం నుండి 5 కిలోమీటర్లు దూరంలో శ్రీశైలం శిఖరం మరియు శిఖరేశ్వరాలయం ఉంటుంది.
Sikhareswara Temple శిఖరేశ్వర ఆలయం మరియు శిఖర దర్శనం
శ్రీశైలంలో ఈ శిఖరమే ఎత్తైన శిఖరం అని చెప్తూ ఉంటారు,ఈ శిఖరం భూమి నుంచి సముద్రమట్టానికి 2030 అడుగుల ఎత్తులో ఉంది.మనం శిఖరం పైకి చేరుకోగానే నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి శ్రీశైల ఆలయ శిఖరాన్ని దర్శిస్తే మనకు మోక్షం లభిస్తుందని చెప్తుంటారు.శ్రీశైల ఆలయ శిఖరం దర్శించాక తిరుగు ప్రయాణంలో శిఖరేశ్వరాలయాన్ని దర్శిద్దాం. ఇప్పుడు మనం మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఉన్న ఆలయాలు,మఠాలు మొదలగువాటిని శ్రీశైల క్షేత్ర మహిమలు రెండవ భాగం లో తెలుసుకుందాం.