Nageshwar Temple-నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర, మనదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవ జ్యోతిర్లింగం నాగేశ్వరం దారుకావనే. ఈ క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర జ్యోతిర్లింగంగా వ్యవహరిస్తారు.ఈ ఆలయంలో శివుడు నాగేశ్వరుడిగా అమ్మవారు నాగేశ్వరిగా కొలువైయున్నారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాన్ని దారుకావనమని పిలుస్తారు. ప్రస్తుతమున్న ఈ ఆలయం ఆధునీకరించబడినది అత్యంత మనోహరంగ దర్శనమిచ్చే నూతన ఆలయాన్ని టి సిరిస్ అధినేత స్వర్గీయ గుల్షన్ కుమార్ నిర్మించినట్లు తెలుస్తుంది.ఇప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏమిటి? ఎలా చేరుకోవాలి? మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Daruka Tapassu-దారుక తపస్సు
పూర్వం దారుక అనే రాక్షసి ఉండేది దారుక అమ్మవారి భక్తురాలు పశ్చిమ సముద్ర తీరంలో(అరేబియా సముద్రం) అమ్మవారి కోసం మహాతపస్సు చేసింది. తాను సుమంగళిగా ఉండాలని తన భర్త దారుకుడికి ఎటువంటి ఆపద రాకూడదు అని వరం కోరుకున్నది. వరాలు పొందిన అనంతరం దారుక మరియు దారుకుడు కలిసి మానవులని, మునులను మరియు దేవతలను హింసించసాగారు. అప్పుడు దేవతలు బృగు మహర్షి యొక్క కొడుకు అయినా ఔర్వ మహర్షి వద్దకు చేరి దారుక దంపతుల యొక్క ఆకృత్యాల గురించి చెప్పి రక్షించమని కోరుకున్నారు. అది విన్న ఔర్వుడు తక్షణమే ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం నుంచి వచ్చే అమృతాన్ని దేవతలకి ఇచ్చాడు. అమృతాన్ని స్వీకరించి శక్తి పొందిన దేవతలు దారుక యొక్క రాక్షస సైన్యం పైన యుద్ధం చేసి ఓడించారు. అప్పుడు రాక్షసులు భూమండలం నుంచి పారిపోయి పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపంలో జీవిస్తూ సముద్రం వైపు ప్రయాణించేవాళ్లను భక్షించ సాగారు.
Supriyudu Sea Travel-సుప్రీయుడి సముద్ర ప్రయాణం
ఆ కాలంలో ఒక శివ భక్తుడుండేవాడు అతని పేరు సుప్రీయుడు అతను ఒక 14 ఓడలను తీసుకొని వ్యాపార నిమిత్తం సముద్ర ప్రయాణం చేస్తూ ఉండేవాడు.అలా ప్రయాణిస్తూ పశ్చిమ సముద్రంలోని రాక్షస సైన్యం జీవిస్తున్న ద్వీపం వద్దకు చేరుకున్నారు. అప్పుడు దారుకుడి రాక్షస సైన్యం సుప్రీయుడు మరియు వారి అనుచరులను తీసుకెళ్లి తమ చరసాలలో బంధించారు.తదనంతరం ఆ ఓడలో ఉన్న జీవులను రోజుకు కొంత మందిని చొప్పున రాక్షసులు భుజించసాగారు. అంతటితో భయభ్రాంతులైనా జనులు వెళ్లి సుప్రీయుడిని వేడుకున్నారు. అప్పుడు సుప్రీయడు తన భార్యతో పాటు తనను బంధించిన ప్రాంతంలో ఒక సైకత లింగాన్ని ప్రతిష్టించి శివుడి పార్థివలింగాన్ని పలు విధాలుగా పూజించాడు.
Siva Parvathula Prathyaksham-శివపార్వతుల ప్రత్యక్షం
ఇలా శివ పూజ చేస్తూ ఉండగా కాపలా కాస్తున్న రాక్షస బటలు సుప్రియుడు ఏదో క్షుద్ర పూజ చేస్తున్నాడని భావించి దారుక దంపతులకు అక్కడ జరుగుతున్న తంతు గురించి వివరించారు. అప్పుడు దారుకతో పాటు అక్కడికి చేరుకున్న దారుకుడు సుప్రీయుడు క్షుద్ర పూజ చేస్తున్నాడని భావించి తన ఖడ్గంతో సుప్రీయుడిని సంహరించబోయాడు.అప్పుడు ఒక్కసారిగా పార్థివలింగం లో నుంచి కోటి సూర్యుల కాంతితో ఈశ్వరుడు ఆవిర్భవించాడు. శివుడు రాక్షస సైన్యాన్ని సంహరించాడు చివరిగా దారుకుడిని సంహరించపోగా దారుక పార్వతీదేవిని వేడుకుంది. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై తాను దారుక యొక్క మాంగళ్యాన్ని కాపాడుతానని వరమిచ్చానని కనుక దారుకుడిని సంహరించడం తగదు అని శివుడిని వారించింది.
Nageshwar Jyothirlinga Avirbhavam-నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం
అప్పుడు శివుడు దారుక దంపతులు ఎంతోమందిని హింసించి భక్షించారని చివరికి పరమ పుణ్యాత్ముడైన సుప్రీయుడిని బంధించి చంపడానికి ప్రయత్నించారని అటువంటి వారిని కాపాడటం తగదు కనుక వీళ్ల వల్ల ప్రజలకు గండం రాకుండా చెయ్యి అని శివుడు పార్వతీదేవితో పలికాడు.అప్పుడు పార్వతీదేవి బదులుగా నీ వాక్యము సత్యము అవ్వాలి నేను ఇచ్చిన వరము సత్యము అవ్వాలి ఈ దారుక దంపతులను క్షమించి, నీ భక్తులని విముక్తులను చేద్దాం అని పలికింది కనుక దారుక దంపతులను పిలిచి ఈరోజు నుంచి క్రూరత్వం విడిచి, ఈ శివలింగాన్ని అదృశ్య రూపంలో కలియుగాంతం వరకు పూజించండి అని చెప్పింది.ఇక శివుడితో సుప్రీయుడి ప్రియా పుత్రుడైన నాగేశ్వరుడి పేరుతో కలియుగాంతం వరకు నాగేశ్వర జ్యోతిర్లింగంగా కొలువై భక్తులను ఆశీర్వదించాలని కోరింది.
PhalaSruthi-ఫలశృతి
ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ గట్టం చాలా గొప్పది మహానుభావుడైన ఈశ్వరుడి జ్యోతిర్లింగాల్లో శ్రేష్టమైనది నాగేశ్వర జ్యోతిర్లింగ రూపం.ఈ జ్యోతిర్లింగరూప దర్శనం వలన వ్యాపారంలో నష్టపోయిన వారికి వ్యాపార అభివృద్ధిని ఇస్తుందని, కలి దోషం తొలగిస్తుందని, అంతేకాకుండా ఈ ఆలయంలో జ్యోతిర్లింగంగా ఉన్న పరమేశ్వరుడిని అమ్మవారితో కలిపి అర్చన చేయడం వలన సకల శుభాలు పొందుతారని శివుడు వరం ఇచ్చాడు.
How To Reach Nageshwar Temple-నాగేశ్వర జ్యోతిర్లింగం ఎలా చేరుకోవాలి
గుజరాత్ రాష్ట్రం లోని దేవభూమి ద్వారకా క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఈ క్షేత్రం చేరుకోవడానికి బస్సు, రైలు మరియు విమాన మార్గాలు కలవు.
రైలు మార్గం:
మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ద్వారక రైల్వేస్టేషన్ చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 18 KM ప్రయాణిస్తే నాగేశ్వర జ్యోతిర్లింగం చేరుకోవచ్చు.
విమాన మార్గం:
మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా జామ్ నగర్ ఎయిర్ పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 126 KM ప్రయాణిస్తే నాగేశ్వర జ్యోతిర్లింగం చేరుకోవచ్చు.
దర్శన వేళలు:
ఉదయం 6:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు.