Grishneshwar Temple- ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ వైభవం,ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12 వ/ ఆఖరి జ్యోతిర్లింగంగ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం అలరారుతుంది.శివుడు కరుణామయుడు అయన చేసిన లీలలు ఎన్నో! అలా తన భక్తురాలిని అనుగ్రహించి ఆమె పేరున వెలిసిన జ్యోతిర్లింగమే ఘృష్ణేశ్వర/ఘుస్మేశ్వర జ్యోతిర్లింగం.మొదట ఈ ఆలయాన్ని వేరుల్ గ్రామానికి చెందిన మాలోజి భోసలే (ఛత్రపతి శివాజీ తాత గారు) నిర్మించారు. ఆ ఆలయం మొఘలుల కాలంలో ధ్వంసం అవ్వగా 18 శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్య బాయి హోల్కర్ తిరిగి నిర్మించారు. ఇప్పుడు ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావ కథను ,ఆలయం ఎక్కడ ఉంది? ఎలా చేరుకోవాలి? మొదలగు విశేషాల గురించి తెలుసుకుందాం.
Grishneswar Jyothirlinga History-ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ కథ:
పూర్వం మహా ర్రాష్ట్రలోని దేవగిరి అనే పర్వత సమీపంలో సుధర్ముడు మరియు సుదేహ అనే దంపతులు నివసించేవారు. సుధర్ముడు పరమ పండితుడు నిత్యం వేద పారాయణ చేసేవాడు అతని ఇల్లు సిరి సంపదలతో విరాజిల్లతుండేది. సుదేహ కూడా అనుకూలవతి అయినా భార్య మరియు ఉత్తమురాలు అయినను వారివురికి చాల కాలంగా సంతానం కలగలేదు. అంతేకాకుండా చుటూ ప్రక్కల వారు సుదేహను గొడ్రాలు అని అవమానించేవారు. అది సహించేలేక సుదేహ తన భర్తయినా సుధర్ముడికి జరిగిన అవమానం గురించి చెప్పి తన సోదరి ఘుస్మేను వివాహం చేసుకోమని చెప్పింది.తద్వారా తన చెల్లికి కలిగే సంతానం తన సంతానంగా భావించి ఈ అవమానాలను ఎదురుకొనవచ్చు అని అనుకున్నది.అప్పుడు సుధర్ముడు సుదేహను ఒకసారి ఆలోచించుకోమని తనకి ఘుస్మేకి పెళ్లి ఐతే సుదేహకి ఘుస్మే సవతి అవుతుందని హెచ్చరించాడు. సుదేహ మాట వినకపోయేసరికి ఘుస్మేని వివాహం చేసుకున్నాడు.
Narada Maharshi’s Advice-నారద మహర్షి చెప్పిన సులభోపాయం:
తదనంతరం సుదేహ తన చెల్లెలికి పుత్ర సంతానం కలగాలని దాసి లాగా సపర్యలు చేసింది. వివాహం ఐన కొంతకాలానికి నారద మహర్షి వచ్చి ఘుస్మేకు సత్పుత్రుడు కలగడానికి సులభోపాయం చెప్పాడు. అదేమిటనగా ప్రతి రోజు 101 పార్థివలింగాలను చేసి పూజించి మరుసటి రోజు ఆ లింగాలను తీసుకెళ్లి మంచి నీళ్ల చెరువులో నిమజ్జనం చేయమని అలా 101 రోజులు పూజించడం వలన సత్పుత్రుడు కలుగుతాడని చెప్పాడు.నారదుడు చెప్పిన విధంగా పూజను ఆచరించడం వలన కొంతకాలానికి ఘుస్మేకి శివుని అనుగ్రహంతో సత్పుత్రుడు జన్మించాడు. అప్పుడు సుదేహ పరమ ఆనందంతో ఆ కొడుకు ఆలన పాలన చూసుకుంటూ ఉండేది. చుట్టుపక్కల వారు గొడ్రాలికి ఇచ్చి బిడ్డను పెంచడం వలన ఆ పిల్లవాడికి మంచిది కాదు అని లేని పోనివి ఘుస్మేకు చెప్పేవారు.ఘుస్మే అవి ఏమీ పట్టించుకోకుండా మా అక్క కోసమే బిడ్డను కన్నాను అని చెప్పింది.
Sudeha Became Jealous-ఈర్ష్యతో రగిలిన సుదేహ:
ఈ సారి చుట్టూ పక్కలవాళ్ళు సుదేహ వద్దకు వెళ్లి ఘుస్మే మీద లేనిపోనివి చెప్పసాగారు. ఘుస్మే వలనే ఈ ఇంటికి సంతానం వచ్చిందని ఘుస్మే కారణంగా ఈ ఇల్లు కల కల లాడుతూ ఉంది అని ఘుస్మేను పొగుడుతూ లేని పోనివి సుదేహకు చెప్పి ఆగ్రహం తెప్పించేవారు . అప్పుడు సుదేహ అనవసరంగా నేనే చేతులారా ఇలా చేసుకున్నాను అని అనుకుంటూ ఘుస్మే పైన ఈర్ష్యతో రగిలిపోయింది.అప్పటి నుంచి పిల్లవాడి పైన కూడా సుదేహకి ఆగ్రహం పెరగ సాగింది. ఈ పిల్లవాడిని పెంచేకొద్దీ తనకు దుఃఖం మరింత పెరిగిపోతుందని ఈ పిల్లవాడు ఎదుగుదల చూస్తూ తను బ్రతకలేను అని అనుకోని,పిల్లవాడు ఉండకూడదు అని భావించింది. ఒక రోజు రాత్రి అందరు నిద్రలో ఉండగా సుదేహ కత్తి తీసుకొని ఉయ్యాలలో ఉన్న పిల్లవాడిని చంపి ముక్కలుగా చేసి చెరువులో కలిపి ఏమి తెలియనట్టు ఇంటికి వచ్చి సేదతీరింది.
Siva Sakshathkaram-శివ సాక్షాత్కారం:
తెల్లవారగానే ఇంటికి వచ్చిన పని మనిషి ఉయ్యాలలో ఉన్నరక్తపు మరకలను చూసి కేకలు పెట్టింది. అప్పుడు సుదేహ ఏమి తెలియనట్టుగా ఉయ్యాల దగ్గరకు వచ్చి దుఃఖాన్ని నటించింది. సుధర్ముడు ఉయ్యాలను గమనించి పరమ దుఃఖాన్ని పొందాడు. పిల్లవాడు మరణించిన విషయం ఘుస్మేకి తెలిసినా కానీ ఎప్పటిలాగే ఘుస్మే రోజువారి పార్థివలింగ పూజ చేసింది. తదనంతరం తన భర్తతో ఈ పార్థివ లింగాలను నిమజ్జనం చేసి వస్తాను అని అన్నది.ఘుస్మే జ్ఞానం కలిగిన స్త్రీ కనుక ఇదంతా పరమాత్మ లీలగా భావించింది .101 పార్థివలింగాలను శివనామ స్మరణ చేస్తూ చెరువులో నిమజ్జనం చేసి వెనుకకు తిరగగానే ఆమెకు కుమారుడు కనిపించాడు అప్పుడు ఘుస్మే బాలుడిని దగ్గరకు తీసుకోని అంత శివానుగ్రహం అని భావించింది. తదనంతరం శివుడు పార్థివ లింగాలను నిమజ్జనం చేసిన ప్రదేశంలో ప్రత్యక్షమై ఘుస్మేకు జరిగిన వృతాంతం చెప్పి ఆగ్రహంతో సుదేహను త్రిసూలంతో సంహరించపోయాడు.
Siva Formed As Ghusmeswar-ఘుస్మేశ్వరుడిగా వెలసిన శివుడు:
అప్పుడు ఘుస్మే పరమేశ్వర నాకు నీ దర్శనం కలగడానికి కారణం మా అక్కే కనుక మా అక్క నాకు ఎంతో మేలు చేసిందని తనని సంహరించవద్దని వారించింది. అప్పుడు శివుడు ఘుస్మే ఉత్తమ లక్షణానికి మెచ్చి ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. ఈ చెరువులో నీవు లింగ రూపంలో దర్శనం ఇచ్చావు కనుక ఈ లింగం కలియుగాంతం వరకు జ్యోతిర్లింగంగా దర్శనం ఇవ్వాలని, నీ దర్శనం చేత పిల్లలకు బాలరిష్ట, అకాలమృత్యు దోషాలు తొలగి సుఖంగా జీవించి పెద్దవారికి కీర్తి తీసుకురావాలని,భార్య భర్తల మధ్య ఐకమత్యం పెరగాలని, సర్వదా నీ దర్శనం చేసుకున్నవాళ్ళకి శుభం కలగాలని, ఈ ఆలయ ప్రాంగణంలో 3 రాత్రులు నిద్రించిన వారికీ పుత్ర సంతానం కలిగేతట్టు చెయ్యాలని ఈశ్వరుడిని కోరింది. అప్పుడు శివుడు తథాస్తు అని పలికి ఈ క్షణమే నీ పేరు మీదుగా జ్యోతిర్లింగంగా వెలిసి ఘుస్మేశ్వరుడిగా ప్రసిద్ధి గాంచుతాను అని పలికాడు.
Phalasruthi-ఫలశృతి:
తదనంతరం శివుడు నా దర్శనం చేసుకున్న పిల్లలకు ఆయువు పెరుగుతుందని, వాళ్లకు మంచి జీవిత భాగస్వామ్యులు వస్తారని, విద్యావంతులు అవుతారని, ధనవంతులౌతారని,ఔదార్యం కలిగి ఉంటారని, వేళకి భోజనం మరియు చివరికి ముక్తి కూడా లభిస్తుందని, అలాగే 101 తరాల వరకు ఆ వంశంలో సద్గుణ సంపన్నులు జన్మిస్తారు అని శివుడు వరం ఇచ్చాడు. ఇది ఘుస్మేశ్వర లింగ ఆవిర్భావ ఘట్టం పరమ పవిత్రమైనది ఆ లింగాన్ని దర్శించిన, ఈ కథను విన్నా/ చదివిన సకల శుభాలు కలుగుతాయి.
Where And How To Reach Grishneswar Temple-ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ?ఎలా చేరుకోవాలి?
ఘుస్మేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలోని వెరూల్ గ్రామంలో ఉంది.ఈ క్షేత్రం చేరుకోవడానికి బస్సు,రైలు మరియు విమాన మార్గాలు కలవు.
రైలు మార్గం:
మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 30 KM ప్రయాణిస్తే ఘుస్మేశ్వర జ్యోతిర్లింగం చేరుకోవచ్చు.
విమాన మార్గం:
మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ఔరంగాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 30 KM ప్రయాణిస్తే ఘుస్మేశ్వర జ్యోతిర్లింగం చేరుకోవచ్చు.
FAQ: