Daksha Yagnam-దక్షయజ్ఞం/శక్తి పీఠాల ఆవిర్భావం

Daksha Yagnam శివ పురాణం ఆధారంగా జరిగిన దక్షయజ్ఞ వృత్తాంతం గురించి  తెలుసుకుందాం. బ్రహ్మ దేవుడి కుమారుడు దక్ష ప్రజాపతి ఇతనికి  చాల మంది కుమార్తెలు కలరు అందులో ఒక కుమార్తె సతీ దేవి(పార్వతీదేవి)ని శివుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కొంతకాలం తర్వాత దక్షుడు ఒక యజ్ఞం చేయాలని భావిస్తాడు అదే దక్షయజ్ఞం. ఇప్పుడు మనం దక్షయజ్ఞం జరగడానికి కారణం ఏంటి? సతీ దేవి ఎలా ప్రాణం  విడిచిపెట్టారు? దక్షయజ్ఞ వినాశనం ఎవరు చేశారు? శక్తీ పీఠాలు ఎలా ఆవిర్భవించాయి? మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Reason For Daksha Yagnam/ దక్షయజ్ఞం జరగడానికి కారణం

భూమండలంలో ప్రయాగ అని ఒక క్షేత్రం ఉన్నది, ఈ క్షేత్రంలో లోక శ్రేయస్సు కొరకు సిద్ధులు, ఋషులు,దేవతలు అందరూ ఒక యజ్ఞం చేయదలుచుకున్నారు. ఈ యజ్ఞానికి బ్రహ్మ,విష్ణు మహేశ్వరులు మరియు సకల దేవతలు వచ్చారు. ఆఖరున దక్ష ప్రజాపతి వచ్చారు దక్షుడి రాకతో త్రిమూర్తులు ముగ్గురు తప్ప సభా ప్రాంగణంలో ఉన్న వారంతా మర్యాదపూర్వకంగా లేచి నమస్కరించారు. బ్రహ్మ నాకు తండ్రి విష్ణువు బ్రహ్మకి తండ్రి వారివురు నాకు గౌరవించకపోయిన పర్లేదు కానీ, ఈ శివుడికి నేను కూతురిని ఇచ్చిన మామగారిని కనుక ఇతను నాకు నమస్కరించి గౌరవించాలి అని దక్షుడు అనుకున్నాడు.

Daksha Yaganam

కాని శివుడి నుంచి ఎటువంటి పలకరింప కలగలేదు, దానితో ఆగ్రహించిన దక్షుడు నోటికి వచ్చిన విధంగా పరమశివుడిని దూషించాడు. అంతేకాకుండా ఈరోజు నుంచి నేను యజ్ఞముల నుంచి ఈ స్మశానవాసుడిని బహిష్కరిస్తున్నాను అని, యాగములలో రుద్రుడు లేని యాగమే శ్రేష్టమవుగాక అని పలకసాగాడు. ఇది గమనించిన నందీశ్వరుడు ఆగ్రహంతో ఎంత మూర్ఖుడివి అహంకారంతో వేద స్వరూపమైన శివుడిని దూషిస్తావా తొందర్లోనే అకాల మరణం పొంది మేక ముఖం కలిగినవాడవు అవుతావు అని దక్షుడిని నందీశ్వరుడు శపించాడు. అప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరుడిని శాంతింపచేసి తన అనుచరులతో ఆ ప్రాంగణం విడిచి వెళ్లిపోయాడు.

Dakshayagnam-దక్షయజ్ఞం ఆరంభం

తదనంతరం దక్షుడు పరమేశ్వరుడి మీద ద్వేషంతో రుద్రుడు లేని యాగాన్ని చేయాలని సంకల్పించాడు. ఈ యజ్ఞానికి శివుడిని తప్ప సకల దేవతలను, ఋషులను మొదలగు వారిని ఆహ్వానించాడు. అక్కడికి వచ్చిన దధీచి మహర్షి ఈశ్వరుడు లేని యజ్ఞం మహా పాప యజ్ఞం అని లోకానికి శ్రేయస్కరం కాదు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు నువ్వు నీ భార్య సమేతంగా స్వయంగా వెళ్ళి శివుడిని పిలవండి అని హితవు పలికాడు. అందుకు దక్షుడు అంగీకరించకపోవడంతో, దధీచి మహర్షి “నీతో పాటు ఈ యజ్ఞానికి వచ్చిన   వారందరిని నాశనం చేసే యజ్ఞం ఇది” అని పలికి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తదనంతరం బ్రహ్మ, విష్ణువు మరియు కొంతమంది మహాత్ములు అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇక యజ్ఞం ప్రారంభమై చాలా కాలం వరకు కొనసాగుతూనే ఉంది.

Daksha yagnam

Lord Chandra Visiting Daksha Yagna/ దక్షయజ్ఞానికి వెళ్తున్న చంద్ర పరివారం

ఒకరోజు రోహిణి దేవి తన భర్త చంద్రునితో కలిసి ఆకాశమార్గాన విమానము లో వెళ్లడం గమనించిన సతీదేవి తన చెలికత్తె విజయను పిలిచి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోమని చెప్పింది. విజయ, చంద్రుని వద్దకు వెళ్లి చంద్ర, నీ ప్రయాణం ఎక్కడికి అని అడగగా చంద్రుడు అందుకు బదులుగా మా మామగారు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నారని ఆ యజ్ఞం చాలా కాలం నుండి జరుగుతోందని చెప్పి వెళ్ళాడు. విజయ తిరిగి వచ్చి సతీదేవికి జరిగిన సంభాషణ చెప్పి ఇంతవరకు మీకు ఈ విషయం తెలియకపోవడం ఏమిటి అని అడిగినది.అందుకు బదులుగా సతీదేవి శివునికి ఆహ్వానం వచ్చి ఉంటుందని కానీ లోక కార్యముల భ్రమలో మర్చిపోయి ఉంటారని భావించి శివుని వద్దకు వెళ్ళింది.

Daksha yagnam

Somnath Jyothirlinga In Telugu-చంద్రుడు శాపగ్రస్తుడు కావడానికి గల కారణం ఏమిటి ?

Sathi Devi Towards Daksha Yagnam/ దక్షయజ్ఞానికి బయలుదేరిన సతీదేవి

నా తండ్రి యొక్క దక్షయజ్ఞ ఆహ్వానం మీకు అందినా నాకు ఎందుకు చెప్పలేదు అని శివుడిని అడగగా, నీ తండ్రి మనకు ఆహ్వానం ఇవ్వలేదని అతడు నా మీద ద్వేషంతో రుద్రుడు లేని యాగం అరుద్ర యాగం చేస్తున్నాడని చెప్పాడు.అందుకు సతీదేవి నేను వెళ్లి మా నాన్న గారి అజ్ఞానం తొలిగించి మిమల్ని ఆహ్వానించేలా చేస్తానని పలకగా, అందుకు శివుడు నీవు ఆ యజ్ఞానికి వెళ్తే నీకు అవమానం కలుగుతుందని వద్దని వారించాడు కానీ సతీదేవి వెళ్లాలని నిర్ణయించుకోగా నందీశ్వరుడిని అమ్మవారితో వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అప్పుడు అమ్మవారితో పాటు 60 వేల రుద్ర గణాలు మహోత్సవముగా యజ్ఞానికి వెళ్లారు. కానీ అక్కడ అమ్మవారిని ఎవరూ గౌరవించడం కానీ నమస్కరించడం కానీ చేయలేదు.సతీదేవి తల్లి మరియు సోదరీమణులు మాత్రం ఆదరించారు .

Daksha yagnam

Srisailam Temple In Telugu-శ్రీశైలం చరిత్ర

Sathi devi left her life/ప్రాణం విడిచిన సతీదేవి

తదనంతరం తండ్రి వద్దకు  వెళ్లి మీరు ఈ యజ్ఞం కేవలం రుద్రుడు మీద ద్వేషంతో చేస్తున్నారని, అలా అరుద్ర యజ్ఞం చేయడం లోకవినాశనానికి దారి తీస్తుందని, ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని శివుడిని శరణుకోరమని చెప్పింది.అందుకు ఆగ్రహించిన దక్షుడు శివ ద్వేషంతో శివుడిని దూషించసాగాడు. శివ దూషన జరుతున్నప్పటికీ దేవతలు,దిక్పాలకులు, ఋషులు ఎవరు నోరు మెదపలేదు. అందుకు ఆగ్రహించిన సతీదేవి “పరమశివుడిని నిందించిన వాడు నిందిస్తున్నప్పుడు విన్నవాడు వీరు ఇరువురు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు” అని శపించి, అందరూ చూస్తుండగానే అగ్నిలో ఆహుతి అయ్యింది .ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రమద గణాలు హాహాకారాలు చేసి దక్షుడు మీద దాడికి వెళ్ళగా బృహ మహర్షి ఋభువులు అనే దేవగణాలను సృష్టించి ప్రమద గణాలు మీదకు పంపించాడు. అవి ప్రమద గణాలను ఓడించాయి.

Sathi Devi Dahanam

Virabhadrudu Avirbhavam/ వీరభద్రుడు ఆవిర్భావం

కైలాసం చేరుకున్న ప్రమద గణాలు సతీదేవి అవమానంతో ప్రాణం విడిచిపెట్టిందని శివుడికి చెప్పారు. అది విన్న పరమేశ్వరుడు ఒక్కసారిగా ఆగ్రహించి జటాజూటంలోంచి ఒక జటను పీకి హుంకారం చేసి నేల మీద కొట్టాడు, అలా కొట్టి కొట్టగానే నల్లని దీర్ఘ శరీరంతో, 1000 చేతులతో ఒక మహా రూపం వలె వీరభద్రుడు అవతరించాడు. వీరభద్రుడు పరమేశ్వరుడికి నమస్కారం చేసి నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు శివుడు జరిగిన వృతాంతం చెప్పి దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని చెప్పి నీకు నా సమస్త శక్తులు అండగా ఉంటాయని నీకు జయము కలుగు గాక అని వీరభద్రుడి ఆశీర్వదించాడు.వీరభద్రుడితో పాటు కొన్ని కోట్ల మంది రుద్రగణాలు, నవ దుర్గా దేవతలు,యక్షులు,రాక్షసులు, క్షేత్రపాలకులు మొదలైన వాళ్ళందరూ తమ తమ పరివారంతో బయలుదేరారు.

Daksha yagnam

Ujjain Mahakaleshwar Temple In Telugu-చితా భస్మంతో అభిషేకించె ఏకైక జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం

Daksha Yagna Vinasanam/ దక్షయజ్ఞ వినాశనం

ఈ విధంగా దక్షయజ్ఞం వైపు వీరభద్రుడు వెళ్తుండగా దిక్కులు పిక్కటిల్లిపోయాయి క్రమంగా వాళ్ళందరూ ఆకాశం నుంచి భూమి వైపుకు దిగారు భూమండలం పైన అడుగు పెట్టగానే భూమి కంపించింది.ముందుగా వీరభద్ర గణాలు దక్షయజ్ఞం చేరుకుని విధ్వంసం సృష్టించారు తరువాత వీరభద్రుడు వచ్చి ఆ యజ్ఞంలో ఉన్న దేవతలను ఋషులను మొదలగు వారిని వివిధ రకాలుగా శిక్షించాడు.చివరికి వీరభద్రుడు గండ్రగొడ్డలితో దక్షుడి తలను పలుమార్లు ఖండించాడు అయినా కానీ తిరిగి జీవం పొందేవాడు. అప్పుడు  వీరభద్రుడు సరస్వతీ దేవి సూచన మేరకు దక్షుడి నవరంద్రాలు మూసివేయగా దక్షుడు మరణించాడు తర్వాత దక్షుడి తల నరికి ఆ తల తీసుకెళ్లి యజ్ఞంలో వేశారు. శివ కార్యం పూర్తయిన అనంతరం వీరభద్రుడు తిరిగి కైలాసం చేరుకున్నాడు.

Daksha yagnam

Health For Gods-దేవతలకు శారీరక స్వస్థత 

దక్షయజ్ఞ వినాశనం అనంతరం అతలాకుతలం అయినా దేవతలు బ్రహ్మ దేవుడి వద్దకు వెళ్లి మాకు శారీరక స్వస్థత కలిగించమని కోరగా  అప్పుడు బ్రహ్మ, విష్ణువుతో కలిసి దేవతలను కైలాసంకి తీసుకెళ్లాడు. కైలాసంలో శివుడు శాంత రూపంతో దర్శనమిచ్చాడు బ్రహ్మ దేవుడు శివుడిని పలు విధాలుగా స్తుతించి ఈ విధంగా శివుడికి విన్నవించుకున్నాడు. ప్రభు నీ అనుచరుడు వీరభద్రుడు ఈ పూషుడికి (సూర్యుడు) దంతాలు విరగొట్టాడు, బహువుడికి కళ్ళు పీకేసాడు, బృహువికి గడ్డం పీకేసాడు ఇలా దేవతలందరు అవయవాలు పోగొట్టుకొని దుఃఖిస్తున్నారు వీళ్ళందరికీ అవయవాలు ప్రసాదించి స్వస్థత అనుగ్రహించమని వేడుకున్నాడు. అలాగే మధ్యలో ఆగిపోయిన యజ్ఞాన్ని పరిపూర్ణం చేయమని భక్తితో ప్రార్థించగా, ఈశ్వరుడు చిరునవ్వుతో మనమందరం మనం చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఈ దక్షుడు రుద్ర ద్వేషంతో యజ్ఞం చేసాడు ఆ అపచారం అతని యజ్ఞాన్ని నాశనం చేసింది ఆ యజ్ఞంలో వీళ్ళు కూడా భాగస్వామ్యులు అవ్వడం వలనే వీళ్ళకి ఈ దుస్థితి అని పలికి, తన అనుగ్రహంతో దేవతలందరికీ స్వస్థత చేకూర్చాడు.

Daksha yagnam

Sakthi Pitala Avirbhavam/శక్తిపీఠాల ఆవిర్భావ ఘట్టం

తదనంతరం యజ్ఞస్థలానికి చేరుకున్నశివుడు దక్షుడికి మేక తల పెట్టి తిరిగి బ్రతికించమని వీరభద్రుడిని ఆదేశిస్తాడు. జీవం పొందిన దక్షుడు తన తప్పు గ్రహించి పరమేశ్వరుడిని పలు విధాలుగా స్తుతించాడు.అనంతరం శివుడు లోక శ్రేయస్సు కొరకు దక్షయజ్ఞాన్ని పరిపూర్ణం చేసాడు. చివరిగా సతీదేవి ప్రాణం విడిచిపెట్టిన స్థలం చేరుకుని సతీదేవి శరీరాన్ని భుజం పైన వేసుకొని మిక్కిలి దుఃఖం తో  తాండవం చేయగా లోకాలన్నీ కంపించాయి,ఇది గమనించిన దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి శివుడిని శాంతింపచేయమని కోరారు.  అప్పుడు విష్ణువు అమ్మవారి శరీరం దూరం అయితే శివుడు ప్రసన్నడౌతాడు అని పలికి తన కోదండంతో 108 బాణాలను ఎక్కుపెట్టి సతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలుగా ఖండించాడు. శాంత స్వరూపం పొందిన శివుడి ఆజ్ఞ మేరకు సతీదేవి శరీర భాగాలు పడిన 108 ప్రదేశాలలో బ్రహ్మ దేవుడు ఆలయాలు నిర్మించాడు. ఈ ఆలయాలనే 108 శక్తి పీఠాలుగా పిలుస్తారు, వీటిలో 18 శక్తి పీఠాలు ప్రసిద్ధిగాంచాయి.

Daksha yagnam

Phalasruthi /ఫలశృతి

ఇది పరమ పవిత్రమైన శివపురాణంలోని సతీఖండంలోని దక్షయజ్ఞ పరిసమాప్తి అని పిలవబడే ఘట్టం. ఈ ఘట్టాన్నిఎవరైనా ఒక్కసారి చదివినా విన్నా సకల శుభాలు పొందుతారు, ఆయుష్షు పెరుగుతుంది, కీర్తిని పెంచుతుంది, జ్ఞాని అవుతారు చివరికి  స్వర్గంతో పాటు మోక్షంని కూడా పొందుతారు.

FAQ:

Leave a comment