Bhimashankar Temple పరమశివుడు అనంత తేజోమయరూపుడు బ్రహ్మ, విష్ణువులు సైతం ఆధ్యంతాలు కనుగొనలేని అనంత జ్యోతిర్లింగ స్వరూపుడు. భరతఖండము నలువైపుల ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించి సకల జనులను ఆశీర్వదిస్తున్నాడు. లోక కళ్యాణం కొరకు సాంబశివుడు భీమాసురుడిని సంహరించి వెలసిన ఆరవ జ్యోతిర్లింగం డాకిన్యాం భీమశంకరం. ఇప్పుడు డాకిన్యాం భీమశంకరం జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏమిటి? ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది మరియు ఎలా చేరుకోవాలి? మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం.
Father Of Bhimasura? -భీమాసురుడి తండ్రి?
పూర్వం కర్కటుడు మరియు పుష్కసి అనే రాక్షస దంపతులు ఉండేవారు వారికి కర్కటి అనే కూతురు కలదు.ఈ కర్కటికి భీమాసురుడు అనే కొడుకు జన్మించాడు.ఒక నాడు భీమాసురుడు తన తండ్రి ఎవరు అని కర్కటిని అడగగా కర్కటి ఈ విధముగా బదులు ఇచ్చింది. తనను విరాజుడు అనే అసురుడికి ఇచ్చి పెళ్లి చేసారని కానీ కొంతకాలానికి విరాజుడు రామచంద్రుడు చేతిలో మరణించాడని చెప్పింది. విరాజుడు మరణించిన కొంతకాలానికి అరణ్యంలో విహరిస్తున్నతనని చూసిన కుంభకర్ణుడు బలవంతపు వివాహం చేసుకొని కొన్ని రోజులకు తనని విడిచి లంకకు వెళ్ళిపోయాడు చెప్పింది. ఇది జరిగిన కొంతకాలానికి నాకు సంతానం కలిగింది అప్పుడు నువ్వు జన్మించావు. కనుక నీ తండ్రి కుంభకర్ణుడు అతను కూడా రాముడి చేత హతమైయ్యాడు అని పలికింది.
Bhimasurudi Tapassu-భీమాసురుడి తపస్సు
జరిగిన వృత్తాంతం విన్న భీమాసురుడు ఆగ్రహం తో నేను రాముడిని సంహరిస్తానని పలికాడు అందుకు తన తల్లి వద్దని వారించింది. సరేనని పలికిన భీమాసురుడి లో లోపల రాముడి ఫై ద్వేషం పెంచుకున్నాడు. కొంతకాలానికి రాక్షసులకు పాక్షిక గురువు అయినా మాల్యవంతుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. భీమాసురుడు అతనికి నమస్కరించి తాను కుంభకర్ణుడి కొడుకునని తనకు మంత్రోపదేశం చేయమని కోరాడు. మంత్రం స్వీకరించిన భీమాసురుడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేసాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తనకు చావు లేని వరం మరియు అపారమైన శక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మ మరణం లేని వరం ఇవ్వలేనని పలకగా భీమాసురుడు బాగా అలోచించి మట్టి తో చేసిన ముద్ద లో నుంచి జ్యోతి వచ్చి నన్ను సంహరించాలని కోరుకున్నాడు బ్రహ్మ తధాస్తు అని పలికి అంతర్ధానమైయ్యాడు.
Bhimasura End Less Sins-భీమాసురుడికి అదుపులేని అకృత్యాలు
వరాలు పొందిన భీమాసురుడు కామరూప దేశం (ప్రస్తుతం డాకిన్యాం భీమశంకర ప్రాంతం) చేరుకొని ఆ దేశపు రాజైన సుదీక్షణుడిని ఓడించి అతనిని అతని భార్యను చెరసాలలో బంధించి వేధించసాగాడు.అయినను సుదీక్షణ రాజు ఒక మట్టితో పార్థివ లింగాని చేసుకొని ప్రతి రోజు మానసిక పూజ చేసే వాడు. ఇది ఇలా ఉండగా భీమాసురుడు క్రమంగా ముల్లోకాలు జయించి అందరిని భాదించ సాగాడు .అప్పుడు దేవతలు బ్రహ్మ దేవుని శరణు కోరగా బ్రహ్మ దేవతలను వెంటపెట్టుకొని కైలాసం చేరుకొని పరమ శివుడిని ప్రార్ధించి భీమాసురుడి అకృత్యాల గురించి చెప్పాడు. అప్పుడు శివుడు తొందర్లో నేను సుదీక్షణుడి పూజ చేస్తున్న పార్థివలింగం నుంచి ఆవిర్భవించి భీమాసురుడిని సంహరిస్తాను అని పలికి దేవతలను శాంతింపచేసాడు.
Bhimashankar Jyothirling Avirbhavam-భీమశంకర జ్యోతిర్లింగ ఆవిర్భావం
ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు భీమాసురుడు తన భటులను పంపి సుదీక్షణ మహారాజు ఏంచేస్తున్నాడో తెలుసుకొని రమ్మన్నాడు. అప్పుడు సుదీక్షణుడు పార్థివలింగానికి పూజ చేస్తూ ఉండటం గమనించిన భటులు, సుదీక్షణుడు భీమాసురుడిని అంతం చేయడానికి క్షుద్ర పూజ చేస్తున్నాడు అని భావించి భటులు భీమాసురుడికి చెప్పారు. అప్పుడు భీమాసురుడు ఆగ్రహంతో ఒక కత్తిని తీసుకొని చెరసాల చేరుకుంటాడు. చెరసాల చేరుకున్న భీమాసురుడు రాజు చేసేది శివ పూజ అని గ్రహించి ఈ శివుడు నన్ను ఏమి చేయగలడు అని తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని పార్థివలింగం మీదకు విసిరాడు.ఆ ఖడ్గం తగిలి పార్థివలింగం బద్దలై అందులోంచి పరమేశ్వరుడు జ్యోతిరూపంలో వెలిసి ఒక్క హుంకారం తో భీమాసురుడిని భస్మం చేసాడు. తదనంతరం శివుడు జ్యోతిస్వరూపంలో ఉద్భవించి నేను కలియుగాంతం వరకు ఈ పార్థివలింగంలో డాకిన్యాం భీమశంకర జ్యోతిర్లింగంగా విరాజిల్లుతూ ప్రజలను ఆశీర్వదిస్తానని పలికాడు.
Phalasruthi-ఫలశృతి:
డాకిన్యాం భీమశంకర జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం భక్తి శ్రద్ధలతో తో విన్నవారికి చదివిన వారికి సకల శుభాలు కలగజేస్తాను అని ఈశ్వరుడు వరమిచ్చాడు.
Where And How To Reach Bhimashankar Temple-భీమశంకర జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది? ఎలా చేరుకోవాలి?
డాకిన్యాం భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర లోని పూణే జిల్లా నుంచి 125 KM దూరంలో ఉంది.ఈ జ్యోతిర్లింగం పూణే జిల్లాలోని భోర్ ఘిర్ గ్రామంలోని సహ్యాద్రి పర్వతశ్రేణుల పైన వెలసి ఉంది.ఈ తీర్థ స్థలాన్ని చేరుకోవడానికి దేశం నలుమూలల నుంచి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు ఉన్నాయి.
రైలు మార్గం: మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా పూణే రైల్వేస్టేషన్ చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 125 KM ప్రయాణించి భీమశంకర జ్యోతిర్లింగం చేరుకోవచ్చు.
విమాన మార్గం: మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా పూణే విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 125 KM ప్రయాణించి భీమశంకర జ్యోతిర్లింగం చేరుకోవచ్చు.
Darshan Timings-దర్శన వేళలు:
ఉదయం 4 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు.
FAQ: