Ayodya Ram Mandir-అయోధ్య మోక్షపురి

Ayodya Ram Mandir అయోధ్య, మధుర, మాయ,కాశి, కంచి, అవంతికపురి, ద్వారవతి చైవ సప్తైతె మోక్షదాయక. అంటే అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతిక (ఉజ్జయిని మహా కాళ్) ద్వారక ఇవన్నీ సప్తమోక్షపురాలు. ఈ ఏడు మోక్షపురాల్లోని మొట్టమొదటి మోక్షపురమైన అయోధ్య నగరం గురించి తెలుసుకుందాం.సూర్యవంశ కులోద్భవడు రామచంద్రుడు, రాముడు జన్మించి, రాముడు పాలించి రామావతారం చాలించిన మహత్తర నగరం అయోధ్య. ఈ నగరం దేవతలచే నిర్మించబడిన నగరం.

Latha Mangeshkar Chouk-లతా మంగేష్కర్ చౌక్

Ayodya Ram Mandir

అయోధ్య ధామ్ చేరుకున్న తర్వాత ప్రవేశ మార్గం లో మొట్టమొదట మనకు సూర్యుడు ఏడు గుర్రాలతో దర్శనమిస్తాడు. ఈ దారిలో రాముని చరిత్ర అంతా గోడల మీద చిత్రలేఖనం చేయబడినది. కొంచెం దూరం వెళ్ళగానే మనకు ఒక పెద్ద వీణ ఉన్న కూడలి కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని లతా మంగేష్కర్ చౌక్ అని అంటారు, గాయని లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థంగా ఈ చౌక్ నిర్మించారు .చౌక్ దగ్గరికి వచ్చి మనం గమనించినట్లయితే  రామ్ మందిరం వెళ్లే దారికి సంబంధించిన బోర్డులన్నీ మనకు కనిపిస్తాయి.లతా మంగేష్కర్ చౌక్ నుంచి హనుమాన్ గర్హి 1.5 KM బాల రాముని ఆలయం 1.8 KM ఉంటుంది.

Kanipakam-కాణిపాకం యొక్క ప్రాముఖ్యత

Hanuman Temple-హనుమాన్ గర్హి(కోట) దేవాలయం

Ayodya Ram Mandir

రామ-రావణ యుద్ధం జరిగిన తర్వాత సీత సమేత రాముడితో వచ్చిన హనుమంతుడు ఇక్కడ సేద తీరేవాడు అని ఇక్కడ వాళ్ళు విశ్వసిస్తారు. ఈ దేవాలయంలో హనుమంతుడికి ఎక్కువగా లడ్డూలని నివేదిస్తుంటారు.స్వామి వారి ముందు మనం కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడానికి మండపం కూడా ఉంటుంది.

Ayodya Ram Mandir-భవ్యమైన దివ్యమైన రామ మందిరం

Ayodya Ram Mandir

హనుమాన్ గర్హి నుంచి 500 మీటర్లు రాగానే మనకు భవ్యమైన దివ్యమైన రామ మందిరం కనిపిస్తుంది. రామ మందిరం లోపలి చేరుకోగానే సుందరమైన అద్భుతమైన శిల్పకళ మన చూపుని ఎటూ తిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తుంది.ఆ తర్వాత బాల రాముని దర్శించుకోండి,ఆ బాల రాముని రూపం రమణీయం కమనీయం.

మనం ఏ రామాలయానికి వెళ్లిన అక్కడ సీతారాములు మనకు దర్శనం ఇస్తారు, కానీ అయోధ్యలో ఉన్న ఈ రామ మందిరంలో రాముడు మాత్రమే మనకి దర్శనం ఇస్తారు .అది కూడా బాల రాముడు ఎందుకంటే అయోధ్య రామ మందిరాన్నిమొట్టమొదట నిర్మించినవారు సీతారాముల కుమారుడైన కుసుడు. ఆయన కేవలం ఐదు సంవత్సరాల వయసు కలిగిన బాలరామున్ని మాత్రమే ప్రతిష్టించారు. అయోధ్యలో రామ మందిరం, హనుమాన్ గర్హి చూసిన తర్వాత మనం ఒక 100 మీటర్లు నడిస్తే దశరథ మహల్ వస్తుంది.

Dasarath Mahal-దశరథ మహల్

Ayodya Ram Mandir

సూర్యవంశ కులోద్భవడు అయినటువంటి దశరథ మహారాజు  గారి రాజభవనం మరియు, శ్రీరాముడు తన సోదరులతో బాల్యాన్ని గడిపిన ప్రదేశం ఇది. ఈ ఆలయంలో రాములవారు తన సోదరులు మరియు తల్లిదండ్రులతో కలసి మనకు దర్శనమిస్తారు.ఈ దశరథ మహల్ త్రేతాయుగంలో నిర్మించారు అయినప్పటికీ కాలక్రమమైన రాజులు పునరుద్ధరణ చేసుకుంటూ వచ్చారు. కలియుగం విక్రమాదిత్య మహారాజు పునరుద్ధరణ చేశారు. దశరథ మహల్ పక్క వీధి నుంచి ఒక 50 మీటర్లు మనం నడిస్తే కనక మహల్ వస్తుంది.

Kanaka Mahal-కనక మహల్

Ayodya Ram Mandir

సీతారాముల వివాహం తర్వాత అయోధ్య నగరం వచ్చిన దంపతులకు కైకేయి ఈ మహల్ ను బహుమతిగా ఇచ్చింది. సీతారాములు ఎక్కువ కాలం  కనక భవన్ లోనే ఉండేవారని ఇక్కడ జనాలు చెప్తూ ఉంటారు .ఇప్పుడు ఈ కనకమహల్ని దేవాలయంగా మార్చడం జరిగింది ఇక్కడ సీతారాములు విగ్రహాల రూపంలో మనకు దర్శనమిస్తారు.ఈ మహల్ని సీతారాముల కుమారుడైన కుసుడు పునర్నిర్మానం చేశారు. ఆ తర్వాత ఎంతోమంది రాజులూ మరియు కలియుగంలో విక్రమాదిత్యుడు పునర్నిర్మానం చేశారు.  కనకమహాల్ దర్శించిన తర్వాత మనం సరయు నదిని చూద్దాం.

Sarayu River-సరయునది

Ayodya Ram Mandir

లతా మంగేష్కర్ చౌక్ నుంచి రైట్ తీసుకొని నేరుగా వస్తే సరయు నది చేరుకుంటాం. ఈ సరయు నది దగ్గర నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు, చేయవచ్చు. ఇంకా సాయంకాలంపూట సరయునదికి హారతులు ఇస్తుంటారు మనం కూడా పాల్గొనవచ్చు, అంతేకాకుండా నదిలో మనం బోట్ జర్నీ కూడా చెయ్యొచ్చు. లతా మంగేష్కర్ చౌక్ కి ఎదురుగా మనకి ఒక గేటు కనిపిస్తుంది.ఆ గేటు లో నుంచి రామ్కిపడి కి వెళ్ళచ్చు, అక్కడ రాత్రిపూట లేజర్ షో జరుగుతుంది కన్నులు విందుగా ఉంటుంది.

Road,Rail& Airways to Ayodya-అయోధ్య మోక్షపురి చేరుకునె మార్గాలు

1.బస్సు మార్గం:

మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ఆర్.టి.సి మరియు ప్రైవేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు  40 నుంచి 50 గంటల ప్రయాణం తర్వాత అయోధ్య చేరుకోవాల్సి ఉంటుంది.

2.రైలు మార్గం:

రైలు ప్రయాణం చేయాలనుకునేవారికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు సదుపాయం కలదు .మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య చేరుకోడానికి దాదాపు 30 నుంచి 40 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

3.విమాన మార్గం:

విమానం ప్రయాణం చేయాలనుకునే వారు విమానంలో అయోధ్యకి నేరుగా వెళ్ళవచ్చుకాని విమాన సర్వీసులు తక్కువగా ఉన్నాయి. అందు కారణం చేత ముందుగ  ఢిల్లీ /గోరఖ్ పూర్ /లక్నోచేరుకోవాలి.అక్కడ నుంచి బస్సు ద్వారా మూడు/నాలుగు గంటలు ప్రయాణించి అయోధ్య చేరుకోవచ్చు.

Darshan Timings-దర్శన వేళలు

ఉదయం 06:30 AM – 12:00 PM.

మధ్యాహ్నం 02:30 PM – 10:00 PM.

 

FAQ

Where is Ayodhya located now?

How many years did Lord Rama live?

Why is Ayodhya a famous place?

What is the best time to visit Ayodhya?

Leave a comment