Somnath temple in telugu ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాధ లింగం. ఈ క్షేత్రంలో శివుడు సోమనాథుడిగా/సోమేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు.ఈ దివ్య క్షేత్రాన్ని చంద్రుడు దర్శించాడట అనంతరం ఈ క్షేత్రం మీదున్న మక్కువ వలన జ్యోతిర్లింగ లింగస్థాపన చేసారని శివ పురాణం ద్వారా తెలుస్తుంది.ఆ కారణంచేత ఈ క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగం సోమనాథ్ లింగంగా ప్రసిద్ధి చెందినది.ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని తర్వాత రావణుడు వెండితో కట్టించాడని అనంతరం ఈ ఆలయాన్నికృష్ణుడు కొయ్యతోను మరియు బీముడు రాతితోను తిరిగి నిర్మించారని చారిత్రక కధనాల ద్వారా తెలుస్తుంది.ఇప్పుడున్న ఆలయాన్ని భారతదేశం స్వాతంత్రం పొందాక గుజరాత్ సింహం వల్లభాయ్ పటేల్ తిరిగి నిర్మించారని తెలుస్తుంది.ఇప్పుడు మనం సోమనాథ్ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం.
Significance Of Somnath Temple-సోమనాథ్ ఆలయం యొక్క విశిష్టత
శివపురాణం ఆధారంగా ప్రచారంలో ఉన్న ఇతిహాసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చంద్రుడు దక్షుని యొక్క 27 మంది కుమార్తెలను వివాహం ఆడాడు రోహిణి అనే కన్య అతనికి ప్రీతిపాత్రమైనది.ఆమెపై గల మోహ వ్యమోహంలో చంద్రుడు మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేయడం వలన వారు దానిని అవమానంగా భావించి తమ తండ్రితో మొరపెట్టుకున్నారు.దక్షుడు జరుగుతున్న పరిణామాలకు ఆగ్రహించి చంద్రుడిని క్షయరోగగ్రస్తుడు అవమని శపించాడు.అనంతరం దేవతల సహాయం తో బ్రహ్మ దేవుని ఒక్క సలహా తో ఆరు నెలలు పాటు చంద్రుడు శివ పూజ చేసి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకున్నాడు.మొదటి పక్షంలో చంద్రునికి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తుందని రెండో పక్షంలో ప్రతిరోజు పెరుగుతూ ఉంటుందని పరమేశ్వరుడు వరమిచ్చాడు.అనంతరం శివుడు జ్యోతిర్లింగంగా కొలువై భక్తులను ఆశీర్వదిస్తాను అని పలుకుతాడు.
Somnath Jyothirlinga In Telugu-చంద్రుడు శాపగ్రస్తుడు కావడానికి గల కారణం ఏమిటి ?
Somnath Antharalayam-సోమనాథ్ అంతరాలయం
ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయం ప్రాంగణంలో కుడి వైపున ఉన్న కపర్తి వినాయక మందిరాన్ని దర్శించుకుంటారు. అనంతరం భక్తులకు దిగ్విజయ ద్వారం దర్శనమిస్తుంది,ఆ తరువాత లోపల ఉన్నమృత్యుంజయ మందిరాన్నిచేరుకుంటారు. ఈ మందిరంలో వందలాది మంది భక్తులు మృత్యుంజయ మంత్రం లిఖిస్తూ జపిస్తూ ఉంటారు.అనంతరం అంతరాలయంలో నందీశ్వరుడు దాని పక్కన తాబేలు శిలారూపం భక్తులకు దర్శనమిస్తాయి.గర్భాలయానికి ముందు మండపంలో ఎడమవైపున గణపతి కుడి వైపున హనుమంతుడు దర్శనమిస్తారు.అనంతరం గర్భాలయం లోపల ఉన్నసోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని భక్తితో తండ్రి పరమేశ్వర మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని ప్రణవిల్లుతారు.
Ahalya Bhai Somnath Temple-అహల్యాభాయ్ హోల్కర్ నిర్మించిన శివాలయం
గర్భాలయంలో సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఆలయం బయట ఉన్న మరో సోమనాథ్ మందిరాన్ని చేరుకుంటారు.అత్యంత మహిమాన్వితమైన ఈ మందిరాన్ని 1783లో అహల్యాభాయ్ హోల్కర్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది.నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో పై భాగంలో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అనంతరం కింద భాగంలో ఉన్నపాతాళ మందిరాన్ని చేరుకొని పార్వతిదేవి ,లక్ష్మీదేవి, దుర్గదేవి మరియు సరస్వతిదేవిని దర్శించుకుంటారు.ఆయా దేవతా మూర్తులను దర్శించుకున్నభక్తులు అనంతరం గర్భాలయంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగితేలుతారు. అనంతరం దగ్గరలో ఉన్నబాల్కతీర్థం సందర్శిస్తారు.
Bhalka Theertham–బాల్క తీర్థం
ఈ తీర్థం సోమనాథ్ మందిరానికి 4 కి.మీ.ల దూరంలో ఉంటుంది.ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వేటగాడు స్పందించిన విషపు బాణం తన కాలి బొటన వేలుకు తగిలి అవతారం చాలించి తిరిగి వైకుంటం చేరుకుంటారు.ఆ వేటగాడు ఎవరో కాదు పూర్వజన్మలో రాముడు చేత సంహరించబడిన వాలి.ఈ ఆలయం లోపల కృష్ణుని విగ్రహం, వేటగాడు మరియు పురాతన కాలం నాటి చెట్టుకాండాన్ని చూడవచ్చు.ఈ ఆలయం పక్కన చిన్న కుండం మరియు శివాలయం కూడా ఉంటాయి దర్శించుకోండి.ఇప్పుడు మనం ఆలయ సమీపంలో ఉన్న ప్రదేశాలన్నీ సందర్శిద్దాం ముందుగా గోలోక్ ధామ్ చేరుకుందాం.
Golok Dham & Gita Mandir & Lakshmi Narayana Mandir-గోలోక్ ధామ్ & గీతా మందిరం & లక్ష్మీనారాయణ మందిరం
గోలోక్ ధామ్ సోమనాథ్ మందిరానికి 2 కి.మీ.ల దూరంలో ఉంటుంది.బాల్కతీర్థంలో శ్రీకృష్ణుని కాలి బొటన వేలుకు బాణం తగిలిన తర్వాత కొంత దూరం ప్రయాణించి ఈ ప్రదేశంలోనే తన శరీరాన్ని విడిచాడు అందుకని గోలోక్ ధామ్ అని పిలుస్తారు.ముందుగా ఎడమవైపు మనకి గీతా మందిర్ కనిపిస్తుంది.ఆలయ గోడలపై భగవద్గీత శ్లోకాలు చిత్రలేఖనం చేశారు.గీతా మందిర్ పక్కనే బలరాముని గృహ ఉంటుంది.ఈ గృహలోన బలరాముడు యోగ సమాధి చెందాడట. పక్కన లక్ష్మీనారాయణ మందిరం ఉంటుంది ఈ లక్ష్మీనారాయణ మందిరానికి ఎదురుగా ఉన్న మండపంలో శ్రీకృష్ణుని పాదాల గుర్తులు చూడవచ్చు.
Triveni Sangamam & Kamnath temple-త్రివేణి సంగమం & కామనాధ్ ఆలయం
త్రివేణి సంగమ సోమనాథ్ మందిరానికి 1 కి.మీ.ల దూరంలో ఉంటుంది.ఈ ప్రదేశంలో హిరణ్,కపిల & సరస్వతి నదులు సంఘమిస్తాయి అనంతరం అరేబియా సముద్రంలో కలిసిపోతాయి.త్రివేణి సంఘం ఎదురుగా కామనాధ్ ఆలయం ఉంటుంది. ఈ ప్రదేశంలో శంకరాచార్యులు చాలా కాలం ధ్యానం చేశారట లోపల శంకరాచార్యులు గారు తపస్సు చేసిన గృహం ఉంటుంది దర్శించండి.
Ram Temple & Parasuram Temple-రామాలయం & పరశురామాలయం
రామాలయం సోమనాథ్ మందిరానికి 1 కి.మీ.ల దూరంలో/త్రివేణి సంగమం దగ్గరలో ఉంటుంది.ఇది వర్తమాన కాలంలో కట్టినాలయం దీనికంటూ ఎటువంటి చరిత్ర లేదు,ముందుగా రామాలయాన్ని దర్శిద్దాం.రామాలయం వెనకనుంచి పరశురాముల యొక్క ఆలయం ఉంటుంది. క్షత్రియులను సంహరించిన తర్వాత పరశురాముడు తన పాపాలను ప్రక్షాళన చేసుకొనుటకై శివుని కొరకు ఈ ప్రదేశంలో తపస్సు చేశారట పరశురాముడిని దర్శించి అనంతరం సోమనాథ్ బీచ్ చేరుకుందాం.
Somnath Beach & Baana Sthambham-సోమనాథ్ బీచ్ & బాణ స్తంభం
సోమనాథ్ బీచ్ మందిరానికి 0.75 కి.మీ.ల దూరంలో ఉంటుంది.ఈ బీచ్ దగ్గర సన్సెట్ పాయింట్ ఉంటుంది అక్కడి నుంచి మనం సన్ సెట్ ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి మనం సోమనాధాలయాన్నికూడా వీక్షించవచ్చు.అనంతరం సోమనాథ్ మందిరం చేరుకొని టెంపుల్ వ్యూ ఫొటోస్ తీసుకోవచ్చు అక్కడ మనకు బాణ స్థంభం కనిపిస్తుంది.ఈ స్తంభంలో ఉన్న బాణము దక్షిణ రేఖవైపు భూమికి సంబందించిన ఆనవాలు లేవని సూచిస్తుంది,అంటే ఈ స్తంభం నిర్మించేటప్పుడే భారతీయులకు భూమి గుండ్రంగా ఉంటుందని దక్షిణ ధ్రువంవైపు ఏమి ఉండవని కేవలం నీరు మాత్రమే ఉంటాయని ముందుగానే తెలుసు.ఈ స్తంభం క్రీస్తు శకం 600 సంవత్సరాలు పూర్వం నిర్మించారని అక్కడి శాసనాలు తెలుపుతున్నాయి.
How to reach Somnath Temple?-సోమనాథ్ మందిరం ఎలా చేరుకోవాలి?
మన తెలుగు రాష్ట్రాల నుంచి సోమనాథ్ మందిరం ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రైలు మార్గం:రైలు మార్గం ద్వారా రావాలనుకునేవారు రైలులో మొదట రాజ్కోట్ లేదా అహ్మదాబాద్ చేరుకోవాలి.అక్కడి నుండి బస్సులో లేద క్యాబ్లో 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి సోమనాథ్ చేరుకోవచ్చు.అదేవిధంగా సోమనాథ్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరవల్ రైల్వే స్టేషన్ కు రాజ్కోట్ నుంచి రైలు కూడా అందుబాటులో ఉంటాయి .
విమాన మార్గం:విమాన మార్గం ద్వారా రావాలనుకునేవారు గుజరాత్ లోని రాజ్కోట్ లేదా అహ్మదాబాద్ చేరుకోవాలి.అక్కడ నుంచి బస్సులో లేద క్యాబ్లో 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి సోమనాథ్ చేరుకోవచ్చు.
Darshan Timings-దర్శన వేళలు
ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారిని మనం దర్శించుకోవచ్చు మరియు ఉదయం 7 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి రాత్రి 7 గంటలకు హారతి ఉంటుంది.